Saturday, November 9, 2024

నిరుపేద అడబిడ్డల పెళ్లిళ్లకు అండగా నిలిచిన ఉప్పల శ్రీనివాస్ గుప్తా

ఉప్పల ఫౌండేషన్ ఆధ్వర్యంలో..నిరుపేద కుటుంబానికి చెందిన ఇద్దరు అమ్మాయిల పెళ్లిళ్లకు తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ అండ్ ఉప్పల ఫౌండేషన్ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా మంగళసూత్రం, మెట్టెలు, చీరె, గాజులు అందజేశారు. సిద్దపేట జిల్లా చేర్యాల దూలిమిట్ట మండలంలోని లింగాపురం గ్రామానికి చెందిన తల్లిదండ్రులు లేని నిరుపేద కుటుంబాలకి చెందిన ఇద్దరు అమ్మాయిల వివాహం కోసం గద్దల అంజలి – ఎస్సీ (తల్లిదండ్రులు లేని అనాథ నాయనమ్మ, లచ్చమ్మ), రాక స్రవంతి – ఎస్సీ (తండ్రి లేడు తల్లి కనకవ్వ కూలీ పని చేసుకొని జీవిస్తున్నారు) ల‌కు అంద‌జేశారు.

హైదరాబాద్ లోని ఉప్పల శ్రీనివాస్ గుప్తా నివాసానికి వచ్చి కలిసిన సందర్భంగా ఉప్పల శ్రీనివాస్ గుప్తా చేతుల మీదుగా మంగళ సూత్రం, మెట్టెలు, చీర, గాజులు విరాళంగా అంద‌జేశారు. ఈ సందర్భంగా ఉప్ప‌ల శ్రీనివాస్ గుప్తా మాట్లాడుతూ.. ఉప్పల ఫౌండేషన్ ఆధ్వర్యంలో.. గత 22 సంవత్సరాలుగా నిరుపేద కుటుంబానికి చెందిన అమ్మాయిల పెళ్లిళ్లకు మంగళసూత్రం, మెట్టెలు, చీరె, గాజులు విరాళంగా ఇవ్వడం జరుగుతుంద‌న్నారు. ఈ విరాళం ఒక్క పేద ఆర్యవైశ్యులకు మాత్రమే కాకుండా అన్ని కులాలకు చెందిన వారికి, నిరుపేద కుటుంబాలకు చెందిన ఆడబిడ్డల పెళ్ళిళ్ళ కోసం అంద‌జేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో.. ఇద్దరు పెళ్ళి కూతుర్లు, సతీష్, భాస్కర్, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement