హైదరాబాద్ లోని తాజ్ దక్కన్ హోటల్ లో Global Vyasya Business Legends(GVBL) అవిఘ్న బిజినెస్ చాప్టర్ (Avigna Business Chapter)ని రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్త ముఖ్య అథితిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉప్పల శ్రీనివాస్ గుప్త మాట్లాడుతూ… కేసీఆర్ సీఎం అయిన తరువాత పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో పరిశ్రమల రంగానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నాడు. అన్ని రంగాలలో ఉన్న పరిశ్రమలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సహాయ సహకారాలు అందిస్తోందన్నారు. తెలంగాణలో నూతనంగా పరిశ్రమలు ఏర్పాటు చేసుకోవడానికి టీఎస్ ఐ పాస్ (TS i pass) ద్వారా 15 రోజులలో అనుమతి ఇస్తున్న ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అని అన్నారు. అంతకు ముందున్న ప్రభుత్వాలు పరిశ్రమల రంగాన్ని పట్టించుకున్న దాఖలాలు లేవన్నారు. ఈ కార్యక్రమంలో చీల అరుణ్ గుప్త, సతీష్ కూన, శ్యామ్ మడుగుల, ఎస్. సందీప్, రాజశేఖర మంచి, కాచం రాము, శ్రీకాంత్ కనుకం, నగేష్ కుమార్, కృష్ణ కుమార్, సంతోష్, రాధ కిరణ్, నాగరాజు కాచం, అరుణ్ తేజ పాల్గొన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement