Saturday, November 23, 2024

శ్రీ మ‌హాంకాళి దేవాల‌య క్యాలెండ‌ర్ ఆవిష్క‌రించిన ఉప్ప‌ల శ్రీనివాస్ గుప్తా

ఐవీఎఫ్ – తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు అండ్ తెలంగాణ రాష్ట్ర టూరిజం డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా చేతుల మీదుగా “లాల్ దర్వాజ్ సింహవాహిని శ్రీ మహంకాళి దేవాలయం” నూతన సంవత్సర-2022 క్యాలెండర్ ఆవిష్కరణ జ‌రిగింది. ఈరోజు ఉదయం హైదరాబాద్ లోని లాల్ దర్వాజ్ సింహవాహిని శ్రీ మహంకాళి దేవాలయంలో ఉప్పల శ్రీనివాస్ గుప్తా తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ వకులాభరణం క్రిష్ణ మోహన్ తో కలిసి లాల్ దర్వాజ్ సింహవాహిని శ్రీ మహంకాళి దేవాలయంలో అమ్మవారిని దర్శించుకుని.. ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారిని శాలువాతో సన్మానించి, సత్కరించారు.


ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దేవాలయాలను అభివృద్ధి చేస్తున్నారన్నారు. రూ.1400 కోట్లతో యాదాద్రి టెంపుల్ ని తీర్చిదిద్దుతున్నారన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బంగారు తెలంగాణకు బాటలు వేస్తూ.. సంక్షేమంలో, అభివృద్ధిలో మన తెలంగాణను దేశంలో నెంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో జీవించాలని, ప్రపంచంలో ఉన్న ఈ కరోనా మహమ్మారి పారిపోవాలని, రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో.. సింహవాహిని శ్రీ మహంకాళి దేవాలయం చైర్మన్ కె.వెంకటేష్, ప్రధాన కార్యదర్శి మారుతి యాదవ్, వైస్ ప్రెసిడెంట్ బద్రీనాద్ గౌడ్, గడ్డం శ్రీనివాస్, ఉమ్మడి దేవాలయాల చైర్మన్ బల్వంత్ యాదవ్, మహేష్, లాల్ దర్వాజ్ సింహవాహిని శ్రీ మహంకాళి దేవాలయం కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement