Tuesday, November 26, 2024

సాయిబాబా ఆలయంలో ఉప్పల శ్రీనివాస్ గుప్తా ప్రత్యేక పూజలు

హైదరాబాద్ లోని చంపాపేట్ సాయిబాబా దేవాలయాన్ని ఐవీఎఫ్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, జాతీయ ప్రధాన కార్యదర్శి ఉప్పల శ్రీనివాస్ గుప్తా దర్శించుకొని సతీసమేతంగా స్వామి వారికి ప్రత్యేక పూజలు, అభిషేకం నిర్వహించారు. తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా దేవాలయానికి విచ్చేసిన ఉప్పల శ్రీనివాస్ గుప్తా-స్వప్న దంపతులకు టెంపుల్ చైర్మన్ దేవాలయ కమిటీ సభ్యులు, పండితులు, పూజారులు కలిసి స్వాగతం పలికారు. ఆ తరవాత ఉప్పల దంపతులకు సామూహిక అర్చనతో పాటు ఆశీర్వచనం చేశారు. ఈ సందర్భంగా వారిని ఆలయ ట్రస్ట్ చైర్మన్, సభ్యులు కలిసి వారిని ఘనంగా సన్మానించారు. సాయిబాబా దేవాలయం కోసం 1 లక్ష రూపాయల విలువైన ద్వారకామయి సీటింగ్ స్టోన్, చావడి మండపం నిర్మాణానికి విరాళంగా ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా.. వారి చేతుల మీదుగా అంద చేయడం జరిగింది.

ఈ సందర్భంగా.. ఉప్పల శ్రీనివాస్ గుప్తా మాట్లాడుతూ.. సాయిబాబా స్వామివారిని దర్శనం కోసం, బాబా వారి ఆశీస్సులు పొందడం కోసం తమ కుటుంబంతో కలిసి రావడం, స్వామి వారికి అర్చన, అభిషేకం చేయడం జరిగిందన్నారు. తమ కుటుంబాన్ని చల్లగా చూడాలని, స్వామి వారి కృప, దీవెనలు ఉండాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. బంగారు తెలంగాణ కోసం బాటలు వేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో వంద సంవత్సరాలు జీవించాలని, రాష్ట్ర ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని, రైతులు పాడి పంటలతో విలసిల్లాలని, ప్రజలందరూ ఆనందంగా వుండాలని స్వామి వారిని కోరుకున్నట్లు తెలిపారు. అనాదిగా వస్తున్న హైందవ ఆచార, సంప్రదాయాలకు అనుగుణంగా, ఆధ్యాత్మికత జీవన విధానాన్ని తెలిపేలా దేవాలయాల గొప్పతనం గురించి, దేవాలయాల దర్శనంతో భక్తులకు కలిగే భాగ్యాల గురించి అందరికీ తెలపాలన్నారు. ఈ కార్యక్రమంలో.. ఆలయ కమిటీ ఛైర్ పర్సన్ అనంత లక్ష్మీ, సోమ సత్యనారాయణ, నాగరాణి, కోశాధికారి సోమ శ్రీనివాస్, దేవాలయ కమిటీ సభ్యులు, భక్తులు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement