దిల్ సుఖ్ నగర్ మారుతి నగర్, కొత్తపేట్ లో శ్రీ శ్రీ శ్రీ ప్రసన్న మహకాళీ నవమ వార్షికోత్సవంలో రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్ గుప్తా మాట్లాడుతూ… కేసీఆర్ సీఎం అయిన తర్వాత దేవాలయాలకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు. దేవాలయాలకు అన్ని విధాలుగా ప్రోత్సాహకాలు, సహాయ సహకారాలు అందిస్తున్న ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వమేనన్నారు. అంతకు ముందున్న ప్రభుత్వాలు దేవాలయాలను పట్టించుకున్న దాఖలాలు లేవన్నారు.
కేసీఆర్ సీఎం అయిన తర్వాత దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ఆధ్వర్యంలో దేవాలయాల అభివృద్ధికి కృషి చేస్తూ, ధూపదీప నైవేద్యాలకు, పూజారులకు జీతాలు ఇస్తున్నారు. తెలంగాణలో ఉన్న వేములవాడ, యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి, రామప్ప, గోల్కొండ బోనాలు, బిర్లా మందిర్, నాగార్జున సాగర్, వేయి స్తంభాల దేవాలయం తదితర దేవాలయాల అభివృద్ధికి అనేకమైన కృషి చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో దేవాలయ చైర్మన్ వజీర్ ప్రకాష్ గౌడ్, మడురి శ్రీనివాస్, మొగుళ్లపల్లి ఉపేందర్, బొగ్గరపు వరుణ్, డా. ఏఆర్ గుప్తా, దచంపల్లి దేవేందర్ గుప్తా, వినయ్, స్థానిక ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.