హైదరాబాద్ : రవీంద్ర భారతిలో కీర్తి ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉగాది ఫెస్టివల్ సెలబ్రేషన్స్ అవార్డ్స్ ప్రజెంటేషన్ -2024 లో ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు, టూరిజం డెవలప్ మెంట్ కార్పొరేషన్ మాజీ ఛైర్మెన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్న కీర్తి ఆర్ట్స్ అకాడమీ వారికి అభినందనలు తెలిపారు. తెలంగాణ యాసను, భాషను కళలను కాపాడుకునేందుకు అందరం కలిసి కృషి చేద్దామన్నారు. కళాకారులకు కూడా తన వంతు సహకారం అందిస్తామన్నారు. ప్రతిభ కలిగిన వారిని, అన్ని రంగాలను ప్రోత్సహించడానికి ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించే వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. తప్పనిసరిగా కృషి చేస్తామని, వారికి ఎల్లవేళలా అండగా నిలిచి చేయూతనందిస్తానన్నారు. తనకు కూడా కళలు, కళాకారులు అంటే చాలా ఇష్టమని, కళలను ప్రోత్సాహించేందుకు ఎల్లప్పుడూ తన సహకారాన్ని అందిస్తానన్నారు.
ఇంకా వారిని మట్టిలో మాణిక్యాలను వెలికితీసి కళలను కాపాడుకుందామన్నారు. ఈ కార్యక్రమంలో ఏసీసీ లైమెడ్ నుమెరాలజిస్ట్ శ్రీ దైవన్య శర్మ, సోషల్ ఆక్టివిస్ట్ డా. వీబీ వసంత రాయలు, శ్రీవిద్య, చైతన్య కంబాల నవ్యశ్రీ, కీర్తి ఆర్ట్స్ అకాడమీ బిందు లిమ్మ, మాల్క కొమురయ్య, మురళి, రంజని, రాధిక, అంకి రెడ్డి, భవచ్చరు, అమరేశ్వరీ, వెంకట రావు, రోజ రమణి, తదితరులు పాల్గొన్నారు.