Saturday, November 23, 2024

HDFC బ్యాంక్ నూతన బ్రాంచ్ ను ప్రారంభించిన ఉప్పల శ్రీనివాస్ గుప్తా

హైదరాబాద్ న‌గ‌రంలోని ఖైరతాబాద్ లోని ఆదర్శ్ నగర్ లో నూతనంగా ఏర్పాటు చేసిన HDFC బ్యాంక్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ స్టేట్ టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా విచ్చేసి, రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా అక్కడ జరిగిన పూజా కార్యక్రమంలో పాల్గొని, జ్యోతి ప్రజ్వలన చేశారు. ఆ తర్వాత ఈ కార్యక్రమానికి విచ్చేసిన సందర్భంగా ఉప్పల శ్రీనివాస్ గుప్తాకు పుష్పగుచ్ఛం అందజేసి శాలువాతో సన్మానించడం జరిగింది. ఈ సందర్భంగా ఉప్పల శ్రీనివాస్ గుప్తా మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని రంగాలు అభివృద్ధి చెందుతున్నాయన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వ్యవసాయ రంగంలో ఎంతో పురోగతి సాధించామ‌న్నారు. వ్యాపార సంస్థలు పెరిగాయని, తెలంగాణలో ఐటీ రంగంలో అభివృద్ధి చెందిందన్నారు. రాష్ట్రంలో అత్యుత్తమ పెట్టుబడులు రాబట్టుట, వ్యాపార రంగాన్ని అభివృద్ధి చేయడంలో ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో ఇండస్ట్రీస్ తీసుకురావ‌డంలో తెలంగాణ ప్రభుత్వం సఫలమైంద‌న్నారు. రోజు రోజుకు హైదరాబాద్ నగరంలో వ్యాపార రంగం బాగా అభివృద్ధి చెందుతుందన్నారు. వ్యాపార పరంగా కూడా బ్యాంక్ లలో ఖాతాదారుల సంఖ్య మరింత పెరిగిందన్నారు. బ్యాంక్ సేవలను వినియోగించుకుంటున్నార‌న్నారు. అన్ని రకాల బ్యాంకుల్లో లావాదేవీలు పెరిగిపోయాయన్నారు. ఈ కార్యక్రమంలో.. HDFC బ్యాంక్ ఆదర్శ్ నగర్ బ్రాంచ్ మేనేజర్ కె.కనకయ్య, క్లస్టర్ హెడ్ మైలవరపు రాజశేఖర్, గన్ ఫౌండ్రి మాజీ కార్పొరేటర్ సంతోష్ మమత గుప్తా, HDFC BANK ఆదర్శ్ నగర్ బ్రాంచ్ బ్యాంక్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement