తెలంగాణలో ఏకైక ఆర్యవైశ్య పంచాంగకర్త డా. సోమవరపు రామలింగయ్య గుప్తా రచించిన శ్రీ శుభకృత్ నామ సంవత్సర పంచాంగం- 2022-2023 ను రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా ఆవిష్కరించారు. బుధవారం ఉదయం హైదరాబాద్ నాగోల్ లోని ఉప్పల శ్రీనివాస్ గుప్తా నివాసంలో తెలంగాణలో ఏకైక ఆర్యవైశ్య పంచాంగకర్త డా.సోమవరపు రామలింగయ్య గుప్తా మర్యాద పూర్వకంగా కలిశారు. శ్రీ శుభకృత్ నామ సంవత్సర ఉగాది సందర్భంగా.. సుమారు 16 సంవత్సరాల అనుభవం కలిగిన 1986లో రాష్ట్రస్థాయి ఉత్తమ ఉప్యాన్యాస బహుమతి గ్రహీత, 2003 జనవరి 31న ప్రభుత్వ కళాశాలలో సీనియర్ లెక్చరర్ గా పదవీ విరమణ పొందిన, 2018లో జిల్లా, రాష్ట్ర స్థాయి ఉత్తమ సేవ వయోవృద్ధ బహుమతి గ్రహీత, తెలంగాణలో ఏకైక ఆర్యవైశ్య పంచాంగకర్త డా. సోమవరపు రామలింగయ్య గుప్తా రచించిన పంచాంగంను ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో.. పంచాంగకర్త డా. సోమవరపు రామలింగయ్య గుప్తా, సరాబ్ లక్ష్మన్ గుప్తా, జనరల్ సెక్రటరీ హైదరాబాద్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ, సోమవరపు ఓమన్ కుమార్ ఎంసీఏ సాఫ్ట్ వేర్ ఇంజనీర్, చంద్ర ప్రకాష్ గుప్తా, తదితరులు పాల్గొన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement