Thursday, November 21, 2024

హ‌నుమాన్ టెంపుల్ కు ఉప్పల శ్రీనివాస్ గుప్తా కిలో వెండి విరాళం

హైదరాబాద్ లోని సుభాష్ చంద్ర బోస్ నగర్, న్యూ హఫీజ్‌పేట, శ్రీ అభయాంజనేయ స్వామి వారి దేవాలయంను తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ పూర్వ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా సతీసమేతంగా సందర్శించి, ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వ‌హించారు. శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయం మకరతోరణంకు ఒక‌ కిలో వెండి విరాళంగా అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా దేవాలయానికి విచ్చేసిన ఉప్పల శ్రీనివాస్-స్వప్న దంపతులకు దేవాలయ కమిటీ సభ్యులు, పండితులు, పూజారులు కలిసి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సామూహిక అర్చనతో పాటు ఆశీర్వచనం అందజేశారు. ఆలయ ట్రస్ట్ చైర్మన్, సభ్యులు కలిసి స్వామి వారి కండువాలతో, సత్కరించారు. సతీసమేతంగా స్వామీ వారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం భక్తులకు, ప్రజలకు ప్రసాదం పంచి పెట్టారు.

ఈ సందర్భంగా.. ఉప్పల శ్రీనివాస్ గుప్తా మాట్లాడుతూ.. శ్రీ అభయాంజనేయ స్వామి వారి దర్శనం కోసం, వారి ఆశీస్సులు పొందడం కోసం త‌మ‌ కుటుంబంతో కలిసి రావడం స్వామి వారికి అభిషేకం, అర్చన చేయడం జరిగిందన్నారు. త‌మ కుటుంబాన్ని కూడా చల్లగా చూడాలని, స్వామి వారికి కిలో వెండి విరాళంగా అందజేశామ‌న్నారు. స్వామి వారి కృప, దీవెనలు మన అందరిపై ఉండాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో బంగారు తెలంగాణ కోసం బాటలు వేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో వంద సంవత్సరాలు జీవించాలని రాష్ట్ర ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని, రైతులు పాడి పంటలతో విలసిల్లాలని, దేశ ప్రజలు, రాష్ట్ర ప్రజలందరూ ఆనందంగా వుండాలని, అందరినీ దీవించాలని ఆంజనేయ స్వామిని కోరుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో.. ఉప్ప‌ల శ్రీనివాస్ గుప్తా సతీమణి ఉప్పల స్వప్న, కుమారులు, అభయాంజనేయ స్వామి దేవాలయం చైర్మన్, గంప సత్యనారాయణ గుప్తా, టెంపుల్ డైరెక్టర్స్ రామకృష్ణ, యాదగిరి, రవీందర్, ప్రభు, రాములు, నటరాజ్, దేవాలయ కమిటీ సభ్యులు, పండితులు, భక్తులు, ఆర్యవైశ్య నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement