శ్రీ శుభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలతో..ఆర్యవైశ్య సంఘం అల్వాల్ మండలం (ఏవీఎస్ఏఎం) తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అనుబంధం, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఆధ్వర్యంలో.. మంగళవారం నాగోల్ లోని ఉప్పల శ్రీనివాస్ గుప్తా కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిశారు. అల్వాల్ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో.. బ్రహ్మశ్రీ బేగంపేట యాయవరం కృష్ణ శర్మ సిద్ధాంతి గారి ప్రథమ పుత్రుడు శ్రీ చంద్రశేఖర శర్మ సిద్ధాంతి గారిచే గుణింపబడిన శ్రీ శుభకృత్ నామ సంవత్సర పంచాంగము 2022-2023..ను తెలంగాణ రాష్ట్ర టూరిజం డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా.. ఉప్పల శ్రీనివాస్ గుప్తా మాట్లాడుతూ.. తెలంగాణ సాంస్కృతి సంప్రదాయాలను గౌరవిస్తూ.. తెలంగాణ పండుగలను ఘనంగా జరుపుకోవాలని, సీఎం కేసీఆర్ స్ఫూర్తితో ముందుకు సాగాలని కోరారు. శ్రీ శుభకృత్ నామ సంవత్సర తెలుగు నూతన సంవత్సర పంచాంగాన్ని ఆవిష్కరించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో.. పాలకుర్తి నరేష్ కుమార్, పొట్టి నాగేశ్వర్ రావు, బచ్చు చంద్ర శేఖర్, బికినెల్లి నర్సింహులు, ఐవీఎఫ్ మహిళా విభాగం పొలిటికల్ చైర్ పర్సన్ గీతా గుప్తా, తదితరులు పాల్గొన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement