హైదరాబాద్ : పేదింటి ఆడబిడ్డల పెళ్లిళ్లకు ఉప్పల ఫౌండేషన్ చేయూతనందిస్తోంది. ఒకేరోజు ఐదుగురు కుటుంబాలకు మంగళ సూత్రం, మెట్టెలు, చీర, గాజులు అందజేశారు. హైదరాబాద్ లోని నాగోల్ లో..ఉప్పల శ్రీనివాస్ గుప్తా నివాసానికి.. పలు జిల్లాల నుంచి వివిధ ప్రాంతాలకు చెందిన కుటుంబాలు వారి కూతురు వివాహం సందర్భంగా.. వచ్చి కలవడం జరిగింది. అందులో భాగంగా వారి కుటుంబ పరిస్థితి గమనించి, వారి ఆర్థిక ఇబ్బందులు తెలుసుకున్నారు.
ఆడబిడ్డల వివాహం కోసం.. ఉప్పల ఫౌండేషన్ ఆధ్వర్యంలో.. తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ అండ్ ఉప్పల ఫౌండేషన్ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా, వారి సతీమణి, ఉప్పల ఫౌండేషన్ కో-చైర్ పర్సన్ ఉప్పల స్వప్న చేతుల మీదుగా మంగళ సూత్రం, మెట్టెలు, చీర, గాజులు విరాళంగా ఇవ్వడం జరిగింది. పుస్తె మెట్టెలు అందుకున్న వారిలో వైష్ణవి – ఆర్యవైశ్య ఉప్పుగూడ, రూప – మేర (బీసీ) ఉప్పల్, శ్రీలేఖ – బ్రాహ్మణ దిల్ సుఖ్ నగర్, జ్యోతి – బ్రాహ్మణ వరంగల్, ఝాన్సి- ఎస్సీ మహబూబ్ నగర్ వారున్నారు. ఈ కార్యక్రమంలో.. సత్యనారాయణ, ఆర్.కన్నయ్య, టీఆర్ఎస్ నాయకులు రమేష్, ఐదుగురు పెళ్ళి కూతుర్లు, వారి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.