ఉప్పల ఫౌండేషన్ ఆధ్వర్యంలో రామంతపూర్ లో నివాసం ఉంటున్న SC, BCలకు చెంది కూలీ పని చేసుకునే సోంపరి మాధవి కీ,శే, బాబూరావుల కూతురు మహేశ్వరి, మంగిలిపల్లి సునీత కీ,శే, శంకర్ ల కూతురు అంజలిల వివాహం సందర్భంగా వారి కార్యాలయంలో రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్త పుస్తె మట్టెలు, చీర, గాజులు అందజేశారు. తండ్రులు లేని పేద అమ్మాయిలకు ఉప్పల ఫౌండేషన్ అండ నిలవడం ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో సంతోష్, నవీన్, బెలిదే నవీన్, సంతోష్, శ్యామ్, వారి కుటుంబ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement