ఉప్పల ఫౌండేషన్ ఆధ్వర్యంలో.. నిరుపేద కుటుంబానికి చెందిన పేదింటి ఆడబిడ్డ పెళ్లికి మంగళసూత్రం, మెట్టెలు, చీరె, గాజులు అందజేశారు. నందిగామ మండలంలోని అంతిరెడ్డి గూడెం గ్రామానికి చెందిన ఎస్సీ బుడగ జంగాల కమ్యూనిటీ, నిరుపేద కుటుంబం,టి.మల్లమ్మ కూతురు అనిత వివాహం కోసం హైదరాబాద్, నాగోల్ లోని ఉప్పల శ్రీనివాస్ గుప్తాను కలిశారు.
ఈ సందర్భంగా వారికి ఉప్పల ఫౌండేషన్ ఆధ్వర్యంలో.. రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ పూర్వ చైర్మన్, ఐవీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు, ఉప్పల ఫౌండేషన్ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా చేతుల మీదుగా మంగళసూత్రం, మెట్టెలు, చీర, గాజులు విరాళంగా అందజేశారు. ఈ విరాళం ఒక్క ఆర్యవైశ్యులకు మాత్రమే కాకుండా అన్ని కులాలకు చెందిన నిరుపేద కుటుంబాల వారికి పుస్తె, మెట్టెలు సహాయం చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో.. పెళ్లి కూతురు అనిత, తల్లి మల్లమ్మ, శేషు, రాములు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, తదితరులు ఉన్నారు.