Wednesday, November 20, 2024

భారత్ లోకి హాంకాంగ్ కన్ఫెక్షినరీ అగ్రగామి యు ఫుడ్స్

హాంకాంగ్ కు చెందిన, రూ.25 కోట్ల టర్నోవర్ కలిగిన కన్ఫెక్షినరీ అగ్రగామి యు ఫుడ్స్ యోలీ యోలా బ్రాండ్ కింద దక్షిణ భారతీయ మార్కెట్లోకి నోరూరించే విస్తృత శ్రేణికి చెందిన ఎగ్జయిటింగ్, ఫ్లేవర్ తో కూడిన, వినూత్న కన్ఫెక్షినరీ ఉత్పాదనలను ప్రవేశపెట్టడం ద్వారా భారతదేశంలోకి ప్రవేశించింది. ఈసందర్భంగా యు ఫుడ్స్ ఇండియా ప్రై.లి. చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ అద్వైత్ ప్రధాన్ మాట్లాడుతూ…. యోలీ యోలా, ఫ్రుబాల్ బ్రాండ్ల కింద కంపెనీ విస్తృత శ్రేణిలో రుచికరమైన, వినూత్న కన్ఫెక్షినరీ ఉత్పాదనలను ప్రవేశపెట్టనుందన్నారు. సాఫ్ట్ క్యాండీలు, లాలీపాప్ లు, చాకొలెట్ బాల్స్, హ్యాపీ బీన్స్, కప్ జెల్లీస్ లాంటివి ఇందులో ఉంటాయన్నారు. మీ రుచిబొడిపెలకు ఆనందం కలిగించేలా యోలీ యోలా సాఫ్ట్ క్యాండీలు నాలుగు నూతన ఫ్లేవర్స్ తో సహా స్ట్రాబెర్రీ, లిచి, గవా, రా మ్యాంగో, కోలా లెమన్ మింట్, అల్ఫాన్సో మ్యాం గో, ఇమ్లీ వంటి రుచుల్లో రానున్నాయని, వీటి ధరలు రూ.1 మొదలుకొని రూ.300 దాకా ఉంటాయన్నారు. తమ ప్రాథమ్యాల జాబితాలో భారత్ ఎంతో పైస్థాయిలో ఉందన్నారు. నాణ్యత, వినూత్న కన్ఫెక్షినరీ ఉత్పాదనల విషయానికి వస్తే దేశం ఇంకా అండర్ సర్వ్ డ్ మార్కెట్ గానే ఉందని తమ అధ్యయనాలు సూచించాయన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement