Friday, November 22, 2024

మూడో రోజూ రికార్డ్ స్థాయిలో క‌రోనా వ్యాక్సినేష‌న్…‌

హైదరాబాద్‌, రాష్ట్రంలో మూడో రోజూ రికార్డ్ స్థాయిలో కరోనా టీకా తీసుకున్నారు. శ‌నివారం నాడు 1,450 ప్రభుత్వ, ప్రైవేటు కేంద్రాల్లో 2,00,800 మంది వ్యాకిన్‌ వేయించుకున్నారు. వారిలో 1,75, 718 మంది మొదటి డోసు, 25,082 మంది రెండో డోసు తీసుకున్నారు. రెండు లక్షల మందిపైగా టీకా పొందడం వరుసగా ఇది మూడో రోజు. కాగా, శుక్రవారం 1,450 ప్రభుత్వ, ప్రైవేటు కేంద్రాల్లో 2,02,817 మంది వ్యాకిన్‌ వేయించుకున్నారు. గురువారం నాడు కూడా రెండు లక్షల మందికి పైగా కరోనా వ్యా క్సిన్ వేయించుకున్నారు.. దీంతో ఇప్ప‌టి వ‌ర‌కు తొలి డోసు వేయించుకున్నవారి సంఖ్య 35,14,673కు, రెండో డోసు పొందినవారి సంఖ్య 4,91,678కు చేరింది. మరోవైపు ఇప్పటివరకు రాష్ట్రానికి 39,98,990 డోసులు వచ్చాయి. శనివారం సాయంత్రం వరకు 38,44,860 డోసులు ఇచ్చారు. ఇంకా 1,54,130 టీకాలు ఉన్నాయి. ఇవి ఒకటి, రెండు రోజులకే సరిపోతాయని వైద్య వర్గాలు వెల్లడించాయి. మళ్లీ కేంద్రం నుంచి వస్తేనే వ్యాక్సినేషన్‌ కార్యక్రమం కొనసాగుతుందని తెలిపాయి. వ్యాక్సిన్‌ వృథా 1.89 శాతమని పేర్కొన్నాయి.

l

Advertisement

తాజా వార్తలు

Advertisement