Friday, November 22, 2024

హైద‌రాబాద్ లో మ‌రో రెండ్రోజులు వ‌ర్షాలు..

హైద‌రాబాద్ లో ఉన్న‌ట్లుండి శనివారం రాత్రి భారీ వర్షాలు కురిశాయి. ఉపరితల ద్రోణి ప్రభావంతో హైదరాబాద్‌లో విస్తారంగా వర్షాలు పడ్డాయి. ఈ వ‌ర్షాల‌తో నగరంలోని లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమ‌య్యాయి. రోడ్లపై భారీగా వరద చేరడంతో డ్రైనేజీలు, మ్యాన్‌హోళ్లు, నాలాలు పొంగిపొర్లాయి. ఈ క్రమంలో న‌గ‌రంలోని ప‌లు ప్రాంతాల్లో భారీ వ‌ర్షం కురిసింది.

న‌గ‌రంలోని షేక్‌పేటలో అత్యధికంగా 11.78 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అలాగే మాదాపూర్‌లో 10.9 సెంటీమీటర్లు, జూబ్లీహిల్స్‌లో 10.5 సెంటీమీటర్లు వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఇలాగే మరో రెండు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశముంద‌ని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. కాబట్టి లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. శ‌నివారం రాత్రి కురిసిన వ‌ర్షాల‌తో ముంపున‌కు గురైన‌ ప్రాంతాల్లో జీహెచ్‌ఎంసీ రెస్క్యూ బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement