Friday, November 22, 2024

నేడు, రేపు వ్యాక్సినేష‌న్ బంద్..

హైద‌రాబాద్ – దేశంలో మూడో విడత వ్యాక్సినేషన్ ప్రక్రియ నేడు ప్రారంభం అవుతున్నది. దేశంలో 18 ఏళ్ళు నిండిన అందరికి వ్యాక్సిన్ అందించేందుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే, తెలంగాణ‌లో 45 ఏళ్ళు నిండిన అందరికి ఇప్పటి వరకు వ్యాక్సిన్ ఇవ్వడం ఇంకా పూర్తి కాలేదు. సెకండ్ డోస్ వ్యాక్సిన్ కోసం, ఫస్ట్ డోస్ కోసం కోట్లాది మంది ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో . కేంద్రం నుంచి సరిపడా డోసులు రాష్ట్రానికి రాకపోవటంతో రాష్ట్ర వ్యాప్తంగా శని, ఆదివారాల్లో వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని నిలిపివేస్తున్నట్టు వైద్యారోగ్య శాఖ సంచాలకుడు జీ శ్రీనివాస్ ప్రకటించారు. ఇప్పటికే వ్యాక్సిన్లు అందకపోవటం వల్ల తొలి డోసు తీసుకున్న అనేక మంది రెండో డోసు కోసం ఎదురు చూస్తున్నారు. కొవాగ్జిన్‌ తొలి డోసు పూర్తిగా కరువైపోగా, కోవిషీల్డ్‌ మొదటి డోసు తీసుకొని సెకండ్‌ డోసు కోసం ఎదురు చూస్తున్న వారి పరిస్థితి దారుణంగా ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement