Sunday, November 10, 2024

ఉస్మానియా యూనివర్సిటీలో కరోనా కలకలం…

హైద‌రాబాద్ – తెలంగాణా క‌రోనా కేసులు త‌గ్గిన‌ట్టే త‌గ్గి మ‌ళ్లీ పెరుగుతున్నాయి.. ముఖ్యంగాఈసారి ఎక్కువుగా విద్యార్ధులు ఈ క‌రోనా భారీన ప‌డుతున్నారు.. ఇప్ప‌టికే ప‌లు రెసిడెన్షియ‌ల్ క‌ళాశాల‌లో, హాస్ట‌ల్స్ క‌రోనా కేసులు ప్ర‌తి రోజూ న‌మోద‌వుతున్నాయి.. తాజాగా ఈ క‌రోనా మ‌హమ్మారి ఉస్మానియా విశ్వ‌విద్యాల‌యానికి చేరింది.. ఇక్క‌డి హాస్ట‌ల్స్ లో ఉంటున్న ఇద్ద‌రు పిజి విద్యార్ధినులు క‌రోనా భారీన ప‌డ్డారు.. దీంతో అధికారులు అప్ర‌మ‌త్త‌య్యారు.. బాధితుల‌ను చికిత్స కోసం కోఠి హాస్ప‌ట‌ల్ త‌ర‌లించారు.. హాస్ట‌ల్లో ఉంటున్న నాలుగు వంద‌ల మంది విద్యార్దినుల‌కు క‌రోనా ప‌రీక్ష‌లు చేస్తున్నారు.. అలాగే హ‌స్ట‌ల్ తో పాటు వ‌ర్శిటీ భ‌వ‌నాల‌లో శానిటైజేష‌న్ చేశారు.. అత్య‌వ‌స‌ర‌మైతే త‌ప్ప బ‌య‌ట‌కు రావ‌ద్ద‌ని వ‌ర్శిటీలో ఆంక్ష‌లు విధించారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement