Monday, January 20, 2025

Twit – కటింగ్లు…కటాఫ్ లు తప్ప ఏం ఒరగబెట్టారు…రేవంత్ సర్కార్ పై కెటిఆర్ ఆగ్ర‌హం


రుణమాఫీ , రైతు భరోసా, సాగునీళ్లు గ్, కరెంటు
కేసీఆర్ కిట్ కటింగ్ చేశారంటూ ట్విట్

హైద‌రాబాద్ – తెలంగాణ‌లో ప్ర‌స్తుతం న‌డుస్తున్న‌ది క‌టింగ్ ల ప్ర‌భుత్వ‌మంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విరుచుకుప‌డ్డారు.. ఉన్న ప‌థ‌కాల‌ను ఊడ‌బీకుడు.. అమ‌లు చేసే ప‌థ‌కాల‌కు క‌టింగ్ లు పెట్టుడు .. ఇదే రేవంత్ పాల‌న అంటూ విమ‌ర్శించారు.. ఈ మేర‌కు ట్విట్ చేశారు కెటిఆర్ .

కటింగులు, కటాఫ్ లు మినహా ఏడాది కాంగ్రెస్ పాలనలో తెలంగాణ సమాజానికి ఒరిగిందేమిటని ప్రశ్నించారు. రుణమాఫీ కటింగ్, రైతు భరోసా కటింగ్, సాగునీళ్లు కటింగ్, కరెంటు కటింగ్, కేసీఆర్ కిట్ కటింగ్, న్యూట్రిషన్ కిట్ కటింగ్, తులం బంగారం కటింగ్, మహాలక్ష్మి రూ. 2,500 కటింగ్, ఫించను రూ. 4,000 వేలు కటింగ్, రూ. 5 లక్షల విద్యాభరోసా కార్డు కటింగ్, జాబ్ క్యాలెండర్ కటింగ్, ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు కటింగ్, విద్యార్థినులకు ఎలక్ట్రిక్ స్కూటీలు కటింగ్, తెలంగాణ అమర వీరుల కుటుంబాలకు రూ. 25 వేల పింఛను కటింగ్, ఉద్యమకారులకు 250 గజాల ఇళ్ల స్థలం కటింగ్, రైతులకు రూ. 3 లక్షల వడ్డీ లేని రుణాలు కటింగ్, భూమిలేని రైతులకు సైతం రైతు బీమా కటింగ్ అని కేటీఆర్ దుయ్యబట్టారు.

- Advertisement -

నిరుద్యోగుల కోసం యూత్ కమిషన్ రూ. 10 లక్షలు వడ్డీ లేని రుణం కటింగ్, నిరుద్యోగ యువతకు నెలకు రూ. 4 వేల నిరుద్యోగ భృతి కటింగ్, ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు రూ. 12 లక్షల ఆర్థిక సాయం కటింగ్, ఆశా కార్యకర్తలకు రూ. 18 వేల వేతనం కటింగ్, మధ్యాహ్న భోజన కార్మికుల వేతనం రూ. 10 వేలకు పెంపు కటింగ్, 50 ఏళ్లు పైబడిన జానపద కళాకారులకు రూ. 3 వేల పెన్షన్ కటింగ్, రేషన్ డీలర్లకు రూ. 5 వేల గౌరవ వేతనం మరియు కమీషన్ కటింగ్, ఆర్టీసీ విలీన ప్రక్రియ కటింగ్, ప్రతి ఆటో డ్రైవర్ కు ఏడాదికి రూ. 12 వేలు కటింగ్, విద్యార్థులకు ఫ్రీ ఇంటర్నెట్ కటింగ్, కౌలు రైతులకు ఎకరాకు ఏడాదికి రూ. 15 వేలు కటింగ్ అని విమర్శించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement