హైదరాబాద్, జులై 19 (ప్రభ న్యూస్) : చికాగో కేంద్రంగా కార్ కేర్ సేవలనందిస్తున్న, అవార్డులు గెలుచుకున్న కంపెనీ టర్టెల్ వ్యాక్స్ ఇంక్ తమ మూడు సరికొత్త కో బ్రాండెడ్ కార్ కేర్ స్టూడియోలను హైదరాబాద్‌లో జెనెక్స్, ఎక్స్ప్లోడర్, ఇండియన్ డెకార్స్ సహకారంతో ప్రారంభించింది. టర్టెల్ వ్యాక్స్ గ్లోబల్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ లారీ కింగ్, టర్టెల్ వ్యాక్స్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ సాజన్ మురళీ పురవంగర ఈ స్టూడియోలను అతిధుల సమక్షంలో ప్రారంభించారు.
ఈసందర్భంగా టర్టెల్ వ్యాక్స్ కార్ కేర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ సాజన్ మురళి పురావంగర మాట్లాడుతూ… తాము హైదరాబాద్‌లో తమ మొదటి రెండు స్టూడియోలను ప్రారంభించిన తర్వాత హైదరాబాద్ నుండి కార్ కేర్‌పై పెరుగుతున్న ఆసక్తిని చూశామన్నారు. ఇక్కడ తమ ఉనికిని విస్తరించడానికి మరో మూడు కార్ కేర్ స్టూడియోని తెరవాలని నిర్ణయించుకున్నామన్నారు. ఈ సరికొత్త స్టూడియోతో తాము రాష్ట్రవ్యాప్తంగా అత్యుత్తమ ప్రీమియం నాణ్యత గల కారు డిటైలింగ్ సర్వీస్‌ను అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు.
ఈ నూతన భాగస్వామ్యం గురించి ఎక్స్పర్ట్ ఆటో స్పా యజమాని హర్షద్ మహాజన్ మాట్లాడుతూ… దిము ఎక్స్పర్ట్ ఆటో స్పా వద్ద నూతన ఆవిష్కరణలలో శ్రేష్ఠతను అందించడానికి, కస్టమర్లకు ఆహ్లాదపరిచే అనుభవాలను అందించేందుకు కృషి చేస్తున్నామన్నారు. కార్ల సంరక్షణలో గ్లోబల్ లీడర్ తో భాగస్వామిగా ఉండటానికి, వారికి ప్రాతినిధ్యం వహించడానికి తాము సంతోషిస్తున్నామన్నారు. టర్టెల్ వ్యాక్స్ తో ఈ అనుబంధం మమ్మల్ని మరింతగా పైకి తీసుకెళ్తుందని, ఇక్కడ కార్ ప్రేమికులకు సంతోషం అందిస్తుందని విశ్వసిస్తున్నామన్నారు. సెరామిక్ కోట్ ప్రొటెక్షన్, హైబ్రిడ్ సెరామిక్ కోటింగ్, ఎక్స్టీరియర్ రిస్టోరేషన్ ట్రీట్మెంట్, ఇంటీరియర్ డిటైలింగ్ ట్రీట్మెంట్, స్పెషాలిటీ ట్రీట్మెంట్ ఉంటాయన్నారు.