Wednesday, October 23, 2024

Cyber ​​Crime | మాజీ సీఎం పేరుతో సైబర్ మోసం…

హైదరాబాద్‌,ఆంధ్రప్రభ : మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి పేరుతో భారీ సైబర్‌ మోసం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. నగరానికి చెందిన ఓ మహిళకు ఫెడెక్స్‌ కొరియర్‌ పేరిట సైబర్‌ నేరస్థులు ఫోన్‌ చేశారు. ఈక్రమంలో ఆమె ఆధార్‌ నెంబర్‌తో ఎండి.ఎం.ఏ డ్రగ్స్‌ పార్శిల్‌ వచ్చిందని తెలిపారు. ముంబై క్రైమ్‌ బ్రాంచ్‌ పోలీసులకు కాల్‌ ఫార్వార్డ్‌ చేసినట్లు నమ్మించారు. అనంతరం మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఫోటో పంపి కేసు తీవ్రంగా ఉందని భయపెట్టారు.

తాము చెప్పిన విధంగా డబ్బు పంపించాలని, లేదంటే ఆమె కుటుంబ సభ్యులపై డ్రగ్స్‌ కేసులు నమోదు చేసి వారి ఖాతాలను ఫ్రీజ్‌ చేసి, వారిని అరెస్టు చేయిస్తామని బెదిరించారు. దీంతో భయాందోళనకు గురైన బాధితురాలు రూ.40 లక్షలు వారు చెప్పిన ఖాతాకు బదిలీ చేసింది. అనంతరం మోసపోయానని గ్రహించి సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. సైబర్‌ క్రైమ్‌ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement