Friday, November 22, 2024

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక‌ల‌లో గులాబీ గుబాళింపు

హైదరాబాద్‌, : నాలుగురోజులుగా సాగుతున్న నరా లు తెగే ఉత్కంఠకు తెరపడింది. పట్టభద్రుల ఎమ్మెల్సీ విజేతలు ఎవరో తేలిపోయింది. చివరి వరకూ కోటా ఓట్లు రాకపోవడంతో.. ఉత్కంఠ భరితంగా సాగిన కౌంటింగ్‌లో.. విజయం టీఆర్‌ఎస్‌ అభ్యర్థులనే వరించింది. రెండు ఎమ్మెల్సీ స్థానాల్లోనూ అధికార టీఆర్‌ఎస్‌ అభ్యర్థులే విజయం సాధించారు. హైదరాబాద్‌- రంగా రెడ్డి- మహబూబ్‌నగర్‌ స్థానంలో మాజీ ప్రధాని పీవీ కుమార్తె, టీఆర్‌ఎస్‌ అభ్యర్థి వాణీదేవి 1,89,339 ఓట్లు సాధించింది. రెండో ప్రాధాన్య లెక్కింపు పూర్తయ్యాక మ్యాజిక్‌ ఫిగర్‌ 1,68,520 ఓట్ల కంటే 20,820 ఓట్లు అధికంగా సాధించినట్లు ఎన్నికల సంఘం అధికారికంగా ప్రకటించింది. శాసనమండలి పట్టభద్రుల కోటా స్థా నాల్లో చెల్లుబాటయ్యే ఓట్లలో ఎవరికి కూడా 50శాతం పైగా రాక పోవడంతో ప్రాధాన్యతా క్రమంలో లెక్కింపును శనివారం వరకు కొనసాగించారు. విజయానికి కావాల్సిన నిర్ణీత 50శాతం ఓట్లు ఏ అభ్యర్థికి రాని కారణంగా శుక్రవారం మధ్యాహ్నం నుంచి రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపును మొదలు పెట్టి, అతి తక్కువ ఓట్లు వచ్చిన వారిని ఎలిమినేట్‌ చేస్తూ చివరకు గెలుపొందిన విజేతలను శనివారం ప్రకటించారు. నల్గొండ- ఖమ్మం- వరంగల్‌ స్థానంలో అధికార టీఆర్‌ఎస్‌ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డి గెలుపొందగా, హైద రాబాద్‌- రంగారెడ్డి- మహబూబ్‌నగర్‌ పట్టభద్రుల నియోజకవ ర్గంలో వాణీదేవి గెలుపొందారు. హైదరాబాద్‌- రంగారెడ్డి- మహ బూబ్‌నగర్‌ స్థానంలో 93 మంది అభ్యర్ధులు, నల్గొండ- ఖమ్మం- వరంగల్‌ స్థానంలో 71 మంది పోటీ చేశారు. నల్గొండ- ఖమ్మం- వరంగల్‌ స్థానంలో 5,05,565 ఓట్లు ఉండగా, 3,87,969 ఓట్లు పోలయ్యాయి. ఇందులో చెల్లిన ఓట్లు 3,66,333కాగా 21636 ఓట్లు చెల్లని ఓట్లుగా తేలచ్చారు. ఇందులో గెలుపు కోటాగా 1,83, 167 ఓట్లను ఈసీ నిర్దేశించింది. ఇక రంగారెడ్డి- హైదరాబాద్‌- మహబూబ్‌నగర్‌లో 5,31,268 మంది ఓటర్లుండగా 3,58,348 ఓట్లు పోలయ్యాయి. ఇందులో చెల్లిన ఓట్లు 3,37,039 కాగా, 21, 309 ఓట్లు చెల్లుబాటు కాలేదు. దీంతో గెలుపునకు 1,68,520 ఓట్లు అవసరమయ్యాయి. నల్గొండ స్థానంలో 71 మంది అభ్యర్థులకు గానూ 47మందికి తొలి ప్రాధాన్యత ఓట్లు 100లోపే వచ్చాయి. హైదరాబాద్‌ స్థానంలో 93 మందిలో 52 మందికి 100లోపు తొలి ప్రాధాన్యత ఓట్లు వచ్చాయి. అయితే తొలి ప్రాధాన్యత ఓట్లలో టీఆర్‌ఎస్‌కు చెందిన వాణీదేవీ ముందంజలో నిల్చారు.
శుక్రవారం మధ్యాహ్నానికి 7 రౌండ్లు పూర్తికావడంతో వాణీదేవికి 1,12,689 ఓ ట్లు, సమీప ప్రత్యర్థి, బీజేపీ అభ్యర్థి రాంచందర్‌ రావుకు 1,04,668 ఓట్లు వచ్చాయి. స్వతంత్య్ర అభ్యర్థి నాగేశ్వర్‌కు 53610, కాంగ్రెస్‌ అభ్యర్థి చిన్నారెడ్డికి 31554ఓట్లు, రమణకు 5973 ఓట్లు వచ్చాయి.
నల్లగొండలో పల్లా జయభేరి
నల్గొండ స్థానంలో ఉత్కంఠ భరితంగా సాగిన లెక్కింపులో మొ దటి ప్రాధాన్యత కోటా ఓట్లు ఎవరికీ రాలేదు. పల్లా రాజేశ్వర్‌రెడ్డి, తీన్మార్‌ మల్లన్న, కోదండరాంల మధ్య హోరాహోరీ పోరు చివరి వరకు నడిచింది. మొదటి ప్రాధాన్యత ఓట్లలో పల్లా రాజేశ్వర్‌రెడ్డికి 1,10,840 ఓట్లు రాగా, తీన్మార్‌ మల్లన్నకు 83,290 ఓట్లు, కోదండరాంకు 70,072 ఓట్లతో వరుసగా నిల్చారు. దీంతో రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు అనివార్యమైంది. రెండో ప్రాధాన్యత ఓట్లలో భాగంగా టీఆర్‌ఎస్‌ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డికి 10,282 ఓట్లు, తీన్మార్‌ మల్లన్నకు 9043 ఓట్లు, కోదండరాంకు 13623 ఓట్లు రాగా, మొత్తంగా పల్లాకు 1,32,921 ఓట్లు, తీన్మార్‌ మల్లన్నకు 108250 ఓట్లు, కోదండరాంకు 103030 ఓట్లు వచ్చాయి. బీజేపీ అభ్యర్థి ఎలిమినేషన్‌ తర్వాత టీఆర్‌ఎస్‌ అభ్యర్థి పల్లాకు 1239 ఓట్ల ఆధిక్యం వచ్చింది.
ఆ తర్వాత టీజేఎస్‌ అభ్యర్థి కోదండరాంను ఎలిమినేట్‌ చేసిన అధికారులు రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపును చేపట్టారు. అనంతరం.. పోటాపోటీగా ఓట్లు రావడం అప్పటికే 25 వేల ఓట్ల ఆధిక్యంలో ఉన్న పల్లాను విజేతగా ప్రకటించారు. పోలింగ్‌ కేంద్రం వద్ద పల్లా రాజేశ్వరరెడ్డికి తీన్మార్‌ మల్లన్న కంగ్రాట్స్‌ చెప్పగా, ఆప్యాయంగా స్వీకరించారు.
90గంటలకు పైగా కౌంటింగ్‌
రెండు స్థానాల్లోనూ.. మూడు షిఫ్ట్‌లలో కౌంటింగ్‌ 90 గంటలకు పైగా సాగింది. తొలి ప్రాధాన్యంలో ఫలితం రాకపోవడంతో రెండో ప్రాధాన్యంలో చివరిదాకా.. ఓట్లు లెక్కించాల్సి వచ్చింది. దీంతో.. మందకొడి పిచ్‌పై టెస్ట్‌ మ్యాచ్‌లా నాలుగురోజుల పాటు కౌంటింగ్‌ సాగింది. గులాబీ గుబాళించింది

Advertisement

తాజా వార్తలు

Advertisement