హైదరాబాద్ : వికారాబాద్ టిఆర్ ఎస్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అసెంబ్లీలో పాట పాడారు. రైతుల గొప్పతనాన్ని తెలియజేస్తూ ఆనంద్ ఓ పాట పాడారు. శాసనసభలో వ్యవసాయ పద్దులపై చర్చ సందర్భంగా ఎమ్మెల్యే ఆనంద్ మాట్లాడారు. వ్యవసాయంలో సాయం ఉంది.. అగ్రికల్చర్‌లో కల్చర్ ఉంది.. సాయం చేసే గుణాన్ని, కల్చర్‌ను నేర్పించిన ఘనత రైతుకే దక్కుతుందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు కాబట్టి.. రైతుల కష్టాలు తెలిసి అనేక పథకాలు ప్రవేశపెట్టారు. నా తెలంగాణ కోటి రతనాల వీణ మాత్రమే కాదు.. నా తెలంగాణ కోటి ఎకరాల మాగాణి అని సీఎం సార్థకత చేశారు. రాష్ర్టంలో వ్యవసాయాన్ని చూసి ఇతర రాష్ర్టాలు ఈర్ష్య పడుతున్నాయి. వ్యవసాయానికి రాష్ర్ట ప్రభుత్వం ఎన్నో నిధులు ఖర్చు పెడుతుందన్నారు. రైతుల గొప్పతనం గురించి చాలామంది కవులు పాటలు, పద్యాల రూపంలో చెప్పారు అని ఎమ్మెల్యే పేర్కొన్నారు. సుద్దాల అశోక్ తేజ రచించిన ఆకుపచ్చ చందమామ నువ్వేలే నువ్వేలే పాటను ఎమ్మెల్యే ఆనంద్ సభలో పాడి వినిపించారు. ఈ సమయంలో అగ్రికల్చర్ మినిస్టర్ నిరంజన్ రెడ్డి ముసి ముసి నవ్వులు నవ్వారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement