సాగర్ వెనకే వరంగల్, ఖమ్మం
ఏప్రిల్ ఆఖరులో నిర్వహించే యోచన
పీఆర్సీతో ఉద్యోగుల్లో హర్షాతిరేకం
పెద్దసారుది పెద్ద చెయ్యని ప్రశంసలు
ఎమ్మెల్సీ విజయాలతో టాప్ స్పీడ్‌లో కారు
కేసీఆర్ మార్క్ వ్యూహం సిద్ధం
హైదరాబాద్, ఆంధ్రప్రభ: శాసనమండలి ఎన్నికల విజయాల ఊపు ఓ వైపు.. పీఆర్సీ ప్రకటనతో ఉద్యోగ, ఉపాధ్యాయవర్గాల్లో వెల్లువెత్తుతున్న సంతోషం మరోవైపు.. ఈ రెండూ టీఆర్ఎస్ గ్రాఫ్‌ను అమాంతం పెంచేశాయి. కేసీఆర్ చాణక్యం.. పెద్ద మనసు రెండూ మరోసారి ఆవిష్కృతమయ్యాయి. ఇదే ఊపు.. రాష్ట్రవ్యాప్తంగా నెలకొన్న సానుకూల వాతావరణంలోనే హైదరాబాద్ తర్వాత అతి పెద్ద దైన గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్‌కు, ఖమ్మం కార్పొ రేషన్‌కు ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావి స్తోంది. ఇందుకు ముహూర్తం కూడా డిసైడైంది. ఉద్యోగుల అంచనాలకు భిన్నంగా, ఆకాంక్షలకు అను గుణంగా.. ఏకంగా 30శాతం పీఆర్సీ ప్రకటించడం తో పాటు ఎంతోకాలంగా ఊరిస్తున్న పదవీవిరమణ వయసు పెంపు హామీని కూడా నెరవేర్చి, అందరి వేత నాలు పెంచి పది లక్షల కుటుంబాల్లో సీఎం కేసీఆర్ సంతోషం నింపారు. పెద్దసారు.. పెద్దచేయి అంటూ జేజేలు
అందుకుంటున్నారు. అననుకూల గ్రౌండ్ పట్టభ ద్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో.. చాణక్య వ్యూహాలతో అద్వితీ య విజయాన్ని అందించి పార్టీని ఫుల్ ఫామ్‌లోకి తెచ్చారు. ఇపుడు రాష్ట్ర స్థాయి నుండి క్షేత్రస్థాయి వరకు పార్టీలో బయటా.. ఉత్సాహపూరిత వాతావరణం నెలకొంది. దీనిని అందిపుచ్చుకుని పెండింగ్ ఎన్నికల న్నీ ముగించాలని టీఆర్ఎస్ నాయకత్వం నిర్ణయించిం ది. వరంగల్, ఖమ్మం కార్పొరేషన్ల పదవీకాలం మా ర్చి 14తో ముగియగా, వీటిపై రాష్ట్రవ్యాప్త ఫోకస్ ఉంది.తాజాగా వార్డుల పునర్విభజన పూర్తిచేసిన ప్రభుత్వం.. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు ముగిసిన తర్వాత ఏక్షణమైనా ఎన్నికలు జరిగే అవకాశం ఉందని ఇప్పటికే ముఖ్యనేతలకు సంకేతాలిచ్చింది. ఉద్యోగు లు.. కొత్త పీఆర్సీ తొలివేతనం అందుకోకముందే.. ఈ ఎన్నిక కూడా జరిగే అవకాశాలున్నాయి. ప్రభుత్వాలు.. ఆయా వర్గాలకు మేలుచేసినపుడు తమకు కూడా ఆయా వర్గాలు మద్దతుగా నిలుస్తారని, నిలవాలని ఆశించడం సహజం. ఏప్రిల్ 1 నుండి కొత్త పీఆర్సీ అమలుకానుండగా, మే 1న కొత్త వేతనం అందనుం ది. ఇందుకు ఒకటి, రెండ్రోజులు ముందుగానే కార్పొ రేషన్ ఎన్నికల క్రతువు ముగించే అవకాశాలున్నాయి.
అన్నీ మనవే..
నాగార్జునసాగర్ ఉప ఎన్నిక ఏప్రిల్ 17న జరగనుండగా, ఆ నియోజక వర్గంపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే సరికొత్త యువ బలగాన్ని మోహరిం చి క్షేత్రస్థాయిలో ప్రచారాన్ని ముమ్మరం చేశారు. మండలి ఎన్నికల విజయోత్సాహంలో ఉన్న టీఆర్ఎ స్ సాగర్‌లో గెలుపు పక్కా అని భావిస్తోంది. వరంగ ల్, ఖమ్మం కార్పొరేషన్లలో కమలానికి చెక్ చెప్పి.. టీఆర్ఎస్కు ఎదురులేదని చెప్పేందుకు తహతహలా డుతోంది. ఈ క్రమంలో పీఆర్సీ ప్రకటన ఉత్సాహాన్ని కూడా పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని పార్టీవర్గాలు ముఖ్యమంత్రిని కోరుతున్నాయి. ఎమ్మెల్సీ విజయం, పదిలక్షల కుటుంబాలకు చరిత్రలో ఎన్నడూలేని విధంగా ఒకేసారి ప్రయోజనం కలిగించి నందున, పెండింగ్ ఎన్నికలను కూడా త్వరగా నిర్వహించాలని సీఎంకు పలువురు ఎమ్మెల్యేలు, ముఖ్యనేతల నుండి వినతులు అందినట్లు తెలిసింది.
కేటీఆర్ నజర్
టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇప్పటికే వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లపై ప్రత్యేక దృష్టి సారించారు. వరంగల్ నగరాభి వృద్ధికి బడ్జెట్లో రూ.250 కోట్లు కేటాయిం చగా, గతంలో వరంగల్ నగర పర్యటన సందర్భంగా ప్రజలకు ఇచ్చిన హామీమేరకు అభివృద్ధి పనులు శరవేగంగా చేయించారు. ఈనెల 27న ఖమ్మం నగర పర్యటనకు కేటీఆర్ వెళ్తున్నారు. ఖమ్మం నగరానికి మకుటాయ మానంగా నిలిచే కొత్త బస్టాండ్‌ను ప్రారంభించనుండ డంతో పాటు ఐటీ హబ్ రెండోదశకు అంకురార్పణ చేయనున్నారు. మంత్రి పువ్వాడ నేతృత్వంలో రూపకల్పన చేసిన పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు. వరంగల్లోనూ త్వరలో పర్యటించనున్నా రు. ఈ రెండు నగరాల ఎన్నికల్లో విజయం సాధి స్తే.. రానున్న రెండున్నరేళ్ళు ఎలాంటి ఎదురులే కుండా పరిపాలన, ప్రజా సంక్షేమ కార్యక్ర మాలు అనుకున్న పద్ధతిలో కొనసాగించ వచ్చని టీఆర్ఎ స్ భావిస్తోంది. వీటితో పాటు సిద్దిపేట, అచ్చం పేట, నకిరేకల్ మునిసిపాలిటీల ఎన్నికలు కూడా పూర్తిచేసే అవకాశముంది. గ్రేటర్ హైదరాబాద్ తర్వాత అత్యంత ప్రాధాన్యమున్న కార్పోరేషన్లు కావడంతో వరంగల్, ఖమ్మంపై పార్టీ ప్రత్యేక దృష్టి పెట్టింది.