Monday, July 1, 2024

Tributes – పీవీ సేవలను స్మ‌రించుకున్న నేత‌లు…

హైదరాబాద్‌: దివంగత ప్రధాని పీవీ నరసింహారావు దేశానికి చేసిన సేవలను తెలుగు జాతి ఎప్పటికీ గుర్తుంచుకుంటుందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ఆయన కాంగ్రెస్‌ పార్టీ నేత అని చెప్పుకోవడాన్ని గర్వంగా భావిస్తున్నామని చెప్పారు. పీవీ జయంతి సందర్భంగా హైదరాబాద్‌లోని పీవీ ఘాట్‌లో మంత్రి సహా పలువురు ప్రముఖులు ఘాట్ పై పుష్ప గుచ్చాలు ఉంచి నివాళులర్పించారు. అనంతరం కోమటిరెడ్డి మీడియాతో మాట్లాడారు. ”పీవీ నరసింహారావు సంస్కరణలు అమలు చేయకపోయుంటే దేశం ఇవాళ ఈ స్థితిలో ఉండేది కాదు. ఆయన మేధావి కాబట్టే అద్భుతమైన పాలన అందించారు. తెలుగుబిడ్డ, తెలంగాణ ముద్దుబిడ్డ పీవీ నరసింహారావుకు శ్రద్ధాంజలి ఘటిస్తున్నా” అని కోమటిరెడ్డి తెలిపారు.

భూసంస్కరణలు అమలు చేయాలని ఇందిరా గాంధీకి పీవీ చెప్పారు. – వీహెచ్‌, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత

- Advertisement -

సోషలిస్టు భావాలు కలిగిన నేత పీవీ. ఆయన అమలు చేసిన భూసంస్కరణలు ఆంధ్రప్రదేశ్‌ రాజకీయ మౌలిక స్వభావాన్నే మార్చేశాయి. – కోదండరాం, తెలంగాణ జన సమితి అధ్యక్షుడు

పీవీ ఆర్థిక సంస్కరణల స్ఫూర్తిని తరువాత వచ్చిన ప్రధానులు కొనసాగించారు. – జానారెడ్డి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత

తొలి తెలుగు ప్రధాని పీవీ అని ఇవాళ మనం రాసుకుంటున్నాం. మైనారిటీ ప్రభుత్వాన్ని చక్కగా పాలిస్తూ దేశాన్ని తీర్చిదిద్దారు. ఆర్థిక సంస్కరణలు అమలు చేశారు. – – సురభి వాణీదేవి, పీవీ కుమార్తె, ఎమ్మెల్సీ

Advertisement

తాజా వార్తలు

Advertisement