Monday, November 18, 2024

ల‌క్ష‌ణాలుంటే వెంట‌నే చికిత్స మొద‌లు పెట్టాల్సిందే…….

హైదరాబాద్‌, : సకాలంలో ట్రీట్‌మెంట్‌ అందితే కరోనా సోకిన వెంటనే నయమవుతుంది. జలుబు, జ్వరం, దగ్గు, ఒళ్లు నొప్పులు, వాంతులు, విరేచనలు ఇలా కరోనా లక్షణాలు కనిపించిన వెంటనే ఏ మాత్రం ఆలస్యం చేయొద్దని రాష్ట్ర ప్రభుత్వం సూచిస్తోంది. వెంటనే ప్రభుత్వ దవాఖానాల్లో అందించే కరోనా కిట్‌తో సొంతంగా వైద్యం ప్రారంభించాలని చెబుతోంది. ప్రస్తుత పరిస్థితులత్లో లక్షణా లు కనిపించిన వెంటనే కరోనా టెస్టుల కోసం జనం పరు గులు పెడుతున్నారు. దీంతో టెస్టు ఫలితాలు వచ్చే సరికి రోజుల సమయం పడుతోంది. ఒక వేళ వైరస్‌ సోకితే అప్ప టికే బాధితుల్లో వైరస్‌ లోడ్‌ పెరిగిపోతోంది. ఈ పరిస్థితుల్లో కరోనా లక్షణాలు కనిపించిన వెంటనే దగ్గర్లోని పీహెచ్‌సీ, యూపీహెచ్‌సీకి వెళ్లి ఓపీలోనే కరోనా కిట్‌ తీసుకుని అందులోని ఔషదాలను వాడాలని సూచిస్తోంది. డాక్సీ సైక్లిన్‌ను ఉదయం రాత్రి 5 రోజులపాటు, పారాసిటమాల్‌, విటమిన్‌ సీ, మల్టిd విటమిన్‌ ట్యాబ్లెట్లను ను ప్రతీ రోజూ ఉద యం, రాత్రి 10 రోజులపాటు, లెవో సిట్రజిన్‌, ర్యాంటడిన్‌, విటమిన్‌ డీ ట్యాబ్లెట్లను ప్రతీ రోజూ ఉదయం ఒకటి చొప్పున వేసుకోవాలని సూచిస్తోంది. అప్పటికే జ్వరం, కరోనా లక్షణాలు తగ్గకపోతే మిథైల్‌ ప్రెడ్నిసోలోన్‌ అనే మాత్రలను ఉదయం, రాత్రి 5 రోజులపాటు వాడాలని వైద్య, ఆరోగ్య శాఖ సూచిస్తోంది. ఈ విషయాలను ప్రత్యేకంగా కరపత్రం రూపంలో ముద్రించి మరీ రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేస్తోంది. ఒకవేళ కిట్లు అందుబాటులో లేకపోయిన దగ్గర్లోని మెడికల్‌ షాపుల్లో కొనుగోలు చేయాలని సూచిస్తోంది.

ఇంటికే హోం ఐసోలేషన్‌ కిట్‌…
కరోనా సోకడంతో హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్న బాధితులకు వారి ఇళ్ల వద్దకే కరోనా కిట్‌లను చేర్చాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కరోనా సెకండ్‌వేవ్‌ ఉధృతమవుతున్న నేపథ్యంలో ఈ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతుండడంతో లక్షణాలు లేని వారి ఇంట్లోనే చికిత్స పొందుతున్నారు. హోం ఐసోలేషన్‌ కిట్‌లో అవిసరమైన ఔషధాలతోపాటు మాస్కులు, శానిటైజర్లను ప్రభుత్వమే ఉచితంగా అందిస్తోంది.
దెబ్బకు కరోనా పరార్‌…
లక్షణాలు కనిపించిన వెంటనే పారాసిటమాల్‌, మల్టివిటమిన్‌ ట్యాబ్లెట్లతో చికిత్స ప్రారంభించాలన్న ప్రభుత్వ నిర్ణయం భేష్‌. ఇలా చేస్తే టెస్టుల కోసం, ఫలితాల కోసం కాలయాపనతో విలువైన సమయం వృథాకాదు. లక్షణాలు ఉన్న వెంటనే చికిత్స ప్రారంభిస్తే కోవిడ్‌ సోకినా ప్రాథమిక దశలోనే నయమవుతుంది. వైరస్‌ లోడ్‌ పెరిగే ఆస్కారం ఉండదు. ఊపిరితిత్తులు ఇన్‌ఫెక్ట్‌ అయ్యే పరిస్థితులు రావు. తొలి దశలోనే రోగి శరీరంలోనుంచి కరోనా పారిపోవాల్సిందే. తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డా. పుట్ల శ్రీనివాస్‌

Advertisement

తాజా వార్తలు

Advertisement