హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్‌లో ఇన్‌స్పెక్టర్లు బదిలీ అయ్యారు. సికింద్రాబాద్, అశోక్ నగర్ ప్రాంతాల్లో జరిగిన ఉద్రిక్తతలో ఆందోళనకారులతో దురుసగా ప్రవర్తించిన 8మంది పోలీస్ అధికారులపై బదిలీ వేటు పడింది. 8మంది పోలీస్ అధికారులను బదిలీ చేస్తూ హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ శనివారం ఉత్తర్వలు జారీ చేశారు.
చిక్కడపల్లి సిఐ సీతయ్య తమను చాలా బూతులు తిట్టాడని, లాఠీచార్జ్ లో విపరీతంగా కొట్టారని గ్రూప్ 1 అభ్యర్థులు కేంద్ర హోం సహాయక మంత్రి బండి సంజయ్ దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే సెంట్రల్ మినిస్టర్ హైదరాబాద్ కమిషనర్ సీవీ ఆనంద్‌కు ఫోన్ చేసి మాట్లాడారు. ఈ నేపథ్యంలో పోలీసులు వ్యవహరించిన తీరు పట్ల బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఆందోళనకారులపై అత్యుత్సాహం ప్రదర్శించిన చిక్కడపల్లి సిఐ సీతయ్యతోపాటు మరో ఏడుగురు పోలీస్ అధికారులను బదిలీ చేస్తూ హైదరాబాద్ సీపీ చర్యలు తీసుకున్నారు.