రాజేంద్రనగర్, ప్రభన్యూస్ : స్టాటిస్టికల్ డేటా అనాలిసిస్పై వ్యవసాయ విశ్వవిద్యాలయం, బోధన, పరిశోధన, విస్తరణ విభాగాల సిబ్బందికి శిక్షణా కార్యక్రమం ఏర్పాటు చేశారు. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆర్ధిక సహకారంతో నారమ్ జాతీయ వ్యవసాయ పరిశోధనా మరియు యాజమాన్య సంస్థ ఈ శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించింది. నాలుగు విడతలుగా ఈ నెల 21వ తేదీవరకు జరిగే ఈ శిక్షణలో ఎన్ఆర్ఎం, క్రాప్ ప్రొటెక్షన్, క్రాప్ ఇంప్రూవ్మెంట్ సామాజికశాస్త్రంకు సంబంధించిన బోధన, పరిశోధన, విస్తరణ విభాగాల ఫ్యాకల్టీ ఈ శిక్షణలో పాల్గొంటున్నారని విశ్వవిద్యాలయ పరిశోధన సంచాలకులు డాక్టర్ జగదీశ్వర్ తెలిపారు.
మొదటి విడత శిక్షణా కార్యక్రమం బుధవారం ప్రారంభమైంది. ఈనెల 22న ముగింపు కార్యక్రమం ఉంటుందని వివరించారు. ఆన్లైన్లో ఈ శిక్షణా కార్యక్రమం నిర్వహిస్తున్నారు. స్టాటిస్టికల్ విశ్లేషణలో నైపుణ్యాలు సాధించడం వల్ల బోధన, పరిశోధన, విస్తరణలలో ఉండే ఫ్యాకల్టీకి మెరుగైన విశ్లేషణలు జరిపే అవకాశం కలుగుతుందన్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..