హైదరాబాద్ లో రేపు (ఆదివారం) ట్రాఫిక్ ఆంక్షలు ఉండనున్నాయి. నెక్లెస్ రోడ్‌లోని పీపుల్స్ ప్లాజా నుంచి గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి స్టేడియం వరకు ‘హైదరాబాద్ రన్నర్స్ మారథాన్ రన్’ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు ఆదివారం ట్రాఫిక్ అడ్వైజరీ జారీ చేశారు. ఉదయం 4.30 గంటల నుంచి ఉదయం 10 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయి.
పీపుల్స్ ప్లాజా, ఎన్టీఆర్ మార్గ్, ట్యాంక్ బండ్, చిల్డ్రన్స్ పార్క్, సెయిలింగ్ క్లబ్, బుధా భవన్, సంజీవయ్య పార్క్, ఖైరతాబాద్, రాజ్ భవన్ రోడ్, సోమాజిగూడ, పంజాగుట్ట ఫ్లైఓవర్, ఎంజే కాలేజీ, ఎస్ఎన్టీ జంక్షన్, సాగర్, సొసైటీ, KBR పార్క్, జూబ్లీ హిల్స్ చెక్‌పోస్ట్, రోడ్ నెం 45, కేబుల్ బ్రిడ్జ్ మార్గంలో మారథాన్ రన్ జరగనుండగా.. ఈ మార్గాల్లో అవసరాన్ని బట్టి మళ్లింపులు విధిస్తామని పోలీసులు తెలిపారు.
ట్రాఫిక్ రద్దీని నివారించడానికి పౌరులు మారథాన్ జంక్షన్లు, మార్గాలను నివారించాలని, గమ్యస్థానాలకు చేరుకోవడానికి ప్రత్యామ్నాయ మార్గాలను తీసుకోవాలని పోలీసులు కోరారు. ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో, సహాయం కోసం ట్రాఫిక్ హెల్ప్‌లైన్ 9010203626కు కాల్ చేయవచ్చు.