హైదరాబాద్: తమ కస్టమర్-సెంట్రిక్ విధానానికి అనుగుణంగా, టొయోటా కిర్లోస్కర్ మోటర్ చెన్నై, ఆంధ్రప్రదేశ్‌లోని తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో (నెల్లూరు, తిరుపతి, ఒంగోలు, విజయవాడ, రాజమండ్రి , కాకినాడ అండ్ గుంటూరు) ప్రభావితమైన వినియోగదారుల కోసం ప్రత్యేక సహాయక చర్యలను ప్రారంభించింది. టీకేఎం దాని డీలర్ భాగస్వాములతో కలిసి ప్రత్యేక అత్యవసర హెల్ప్‌లైన్ నంబర్లను ఏర్పాటు చేసింది. అవసరమైన కస్టమర్లకు తక్షణ సహాయం అందించడానికి ప్రత్యేకంగా సిబ్బందిని ఏర్పాటు చేసింది.
ఈసందర్భంగా టొయోటా కిర్లోస్కర్ మోటర్‌లోని స్ట్రాటజిక్ బిజినెస్ యూనిట్ (సౌత్ జోన్) వైస్ ప్రెసిడెంట్ తకాషి టకామియా మాట్లాడుతూ… ఈ సవాలు సమయాల్లో తాము తమ కస్టమర్లు, వారి కుటుంబాల భద్రత, శ్రేయస్సు కోసం కట్టుబడి ఉన్నామన్నారు. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ఉత్పన్నమయ్యే ప్రతికూల పరిస్థితుల వల్ల తమ వినియోగదారులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు తాము చర్యలు తీసుకుంటున్నామన్నారు. అంకితమైన కస్టమర్ హెల్ప్‌లైన్ సేవలతో పాటు, ప్రత్యేకంగా అమర్చబడిన హిలక్స్ వాహనాల మద్దతుతో ప్రభావితమైన కార్ రెస్క్యూ కార్యకలాపాలు కూడా అందించబడుతున్నాయన్నారు.