హైదరాబాద్ : కస్టమర్-ఫస్ట్ అప్రోచ్ పట్ల తమ నిబద్ధతకు అనుగుణంగా, విలువ ఆధారిత సేవల ద్వారా అద్భుతమైన కొనుగోలు అనుభవాన్ని సృష్టించటంలో భాగంగా టొయోటా కిర్లోస్కర్ మోటర్ ప్రైవేట్ లిమిటెడ్ (టొయోటా కిర్లోస్కర్ మోటర్, టికెఎం) తమ ఆసమ్ న్యూ కార్ డెలివరీ సొల్యూషన్ ను ప్రవేశపెట్టినట్లు ప్రకటించింది.
ఈ సందర్భంగా టొయోటా కిర్లోస్కర్ మోటర్ సేల్స్-సర్వీస్-యూజ్డ్ కార్ బిజినెస్ వైస్ ప్రెసిడెంట్ శబరి మనోహర్ మాట్లాడుతూ… టొయోటా కిర్లోస్కర్ మోటర్లో, కస్టమర్-సెంట్రిసిటీకి తమ నిబద్ధత చాలా ముఖ్యమైనదన్నారు. తాము నిరంతరం కొత్త ఆవిష్కరణలు చేయడానికి ప్రయత్నిస్తుంటామన్నారు. ఆసమ్ న్యూ కార్ డెలివరీ సొల్యూషన్ ప్రవేశం శ్రేష్ఠత పట్ల తమ అచంచలమైన నిబద్ధతకు ఉదాహరణ అన్నారు. డీలర్ స్టాక్‌యార్డ్‌ల నుండి డీలర్‌కు కస్టమర్లకు ఎటువంటి అదనపు ఖర్చు లేకుండా క్యారియర్ సర్వీస్ ద్వారా కొత్త కార్ల తరలింపును ఇది అందిస్తోందన్నారు. ఈ కార్యక్రమం ముఖ్యంగా గ్రామీణ, సెమీ-అర్బన్ ప్రాంతాల్లోని వినియోగదారులకు ప్రయోజనం చేకూరుస్తుందని తాము విశ్వసిస్తున్నామన్నారు.