విజయవాడ: 2022-23 చివరి నాటికి అమ్మోనియం నైట్రేట్ మొత్తం స్థాపిత సామర్థ్యం 10,96,000 టన్నులుగా ఉందని మనీష్ సిన్హా తెలిపారు. అమ్మోనియం నైట్రేట్ అనేది ఒక పారిశ్రామిక రసాయనం, ఇది మైనింగ్, మౌలిక సదుపాయాల అభివృద్ధికి గాను పేలుడు పదార్థాల తయారీకి ప్రాథమిక పదార్థంగా ఉపయోగించబడుతుందన్నారు.2022-23 నాటికి అమ్మోనియం నైట్రేట్ మొత్తం అంచనా డిమాండ్ 12,23,000 టన్నులు. ఇది 1,27,000 టన్నుల డిమాండ్-సరఫరా అంతరాన్ని సూచిస్తుందన్నారు. ఈ అంతరానికి పూర్తి విరుద్ధంగా దేశంలోకి వచ్చిన మొత్తం దిగుమతులు, రష్యన్ తయారీదారులు డంపింగ్ చేయడం ద్వారా వచ్చింది 3,56,000 టన్నులు. ఈ గణాంకాలు 2022-23 ఆర్థిక సంవత్సరంలో దిగుమతి చేసుకున్న 2,29,000 టన్నుల అధిక (మిగులు) దిగుమతులను సూచిస్తున్నాయన్నారు.
ఈ దిగుమతుల్లో 95శాతం వైజాగ్ నౌకాశ్రయం ద్వారా వచ్చి, జాతీయ, వ్యూహాత్మక ప్రాముఖ్యత కలిగిన సంస్థలు, జనసాంద్రత కలిగిన ప్రాంతాల గుండా ప్రయాణించడంతో జాతీయ భద్రతను ప్రమాదంలో పడేశాయన్నారు. జాతీయ, వ్యూహాత్మక ప్రాముఖ్యత కలిగిన అనేక సంస్థలు వైజాగ్ ఓడరేవుకు అత్యంత సమీపంలో ఉన్నాయని గమనించడం ముఖ్యమన్నారు. ఉదాహరణకు వైజాగ్ స్పెషల్ ఎకనామిక్ జోన్, వైజాగ్ విమానాశ్రయం, హెచ్ పీసీఎల్ రిఫైనరీ, భారతదేశ తూర్పు నౌకాదళ కమాండ్, ఇండియన్ స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్, విశాల మైన నివాస ప్రాంతమన్నారు. వైజాగ్ నౌకాశ్రయంలో అమ్మోనియం నైట్రేట్ నిర్వహణకు సంబంధించి ఏదైనా అవాంఛనీయ ప్రమాదం లేదా పేలుడు సంభవించినట్లయితే, అది స్థానిక సమాజంపై, జాతీయ, వ్యూహాత్మక ప్రాముఖ్యత కలిగిన పరిసర సంస్థలపై విపత్కర ప్రభావాలకు దారితీయవచ్చన్నారు.