Tuesday, November 19, 2024

Top Sectors – తెలంగాణ టాప్ … చోద‌క‌శ‌క్తులుగా ఐటి, ఫార్మా రంగాలు ..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: రాష్ట్ర సొంత వనరుల రాబడి మొదలుకొని అనేక ఆర్థిక అంశాల్లో తెలంగాణ దూసుకుపోతున్నది. రాష్ట్ర సొంత వనరుల ఆదాయం బడ్జెట్‌ అంచనాలను మించి మరీ ప్రగతి సాకార మవుతోంది. ఏటా రూ.1.70 లక్షల కోట్లకుపైగా రాబ డులను ఆశిస్తున్న తెలంగాణలో ఆర్థిక ప్రగతి ఆశాజ నకంగా పెరుగుతూ వస్తున్నది. 2015నుంచి రాష్ట్రం లోని బ్యాంకుల్లో డిపాజిట్లు రూ.8.99 లక్షల కోట్లకు చేరడం తెలంగాణ సంపదకు తార్కాణంగా నిలు స్తోంది. ఈ డిపాజిట్లు గడచిన తొమ్మిదేళ్లలో రెట్టింపునకు మించాయి. ఇదే ఇప్పుడు తెలంగాణ స్థిర ఆర్థిక పరి పుష్టికి ఉదాహరణగా మారుతోంది. తెలంగాణలో నెల కొన్న పాలన, ప్రభఢుత్వం, అనుసరిస్తున్న విధానాలు, అవలంభిస్తున్న పాలసీలు తదితరాలు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను, సంస్థాగత మదుపరులను ఆకర్శిస్తు న్నాయని తాజా గణాంకాలు ధ్రువీకరిస్తున్నాయి.

ఎంఎస్‌ఎంఈలు, స్టార్టప్‌లు, నిర్మాణ, ఐటీ, ఔషధ, ఏరోనాటిక్స్‌, వ్యవసాయ ఇలా అనేక రంగాల్లో పురోగతికి తెలంగాణ కేరాఫ్‌ అడ్రస్‌గా నిల్చింది. దీంతో సంపద సృష్టితోపాటు, రాబడులు, పెట్టుబడులు, డిపా జిట్లు పెరుగుతున్నాయి. దీంతో ఇప్పుడు సొంతంగా తెలంగాణ తనకుతానుగా ఆర్థికంగా నిలదొక్కుకునే స్థాయిలో దేశంలోనే మొదటి వరుసలో ఉన్నది. స్వాతంత్య్రం సిద్ధించినప్పుడు ఏర్పడిన రాష్ట్రాలను, అభివృద్ధి చెందిన రాష్ట్రాలుగా చెప్పుకునే స్టేట్‌లను అలవోకగా తెలంగాణ అధిగమించింది. దీంతో కేంద్రం ఎటువంటి ఆర్థిక సహకారం అందించకపోయినా తన కాళ్లపై తాను నిల్చి, కేంద్ర ప్రభుత్వానికే రూపాయిలో 40పైసలు చెల్లించే స్థాయికి ఎదిగింది. తాజాగా తెలంగాణ సంస్కరణల ఫలితంగా సొంత వనరుల రాబడులు రూ.1.70 లక్షల కోట్లకు చేరగా, ఆర్థిక ఏడాది ఆరంభంలోనే పలు శాఖలు అంచనాలను మించుతు న్నాయి. ప్రధానంగా స్టాంపులు-రిజిస్ట్రేషన్‌, ఎక్సైజ్‌, గనులు, రవాణా, వాణిజ్య పన్నులు మెరుగైన ఫలితాలను కనబరుస్తున్నాయి. ఎక్సైజ్‌ ఆదాయం ఈ ఏడాదిలో అంచనాలను మించింది. కేవలం దరఖా స్తుల రూపంలోనే మద్యం దుకాణాల కేటాయింపు అంశంలో రూ.3 వేల కోట్లు ఆర్జించగా, లైసెన్సు ఫీజుల చెల్లింపులు మరింత రాబడికి బాటలు వేయనున్నాయి. స్టాంపులు-రిజిస్ట్రేషన్లు, వాణిజ్య పన్నుల శాఖలు కూడా భారీ రాబడి దిశగా దూసుకుపోతున్నాయి.

ఒకప్పుడు బ్యాంకింగ్‌ రంగంలో తెలంగాణలో కేవలం 8.87శాతమే బ్యాంకులు ఉండగా, 2015 నుంచి 18.5శాతానికి చేరుకున్నాయి. 884 షెడ్యూల్డ్‌ కమర్షియల్‌ బ్యాంకుల శాఖలు, 147 ప్రాంతీయ గ్రామీణ బ్యాంకు శాఖలు కొత్తగా ఏర్పాటయ్యాయి. పట్టణ, గ్రామీణ, సెమీ అర్బన్‌ ప్రాంతాల్లో బ్యాంకింగ్‌ కార్యకలాపాల విస్తరణ శరవేగంగా జరుగుతోంది. దేశంలోని డిపాజిట్లు మొత్తంలో 8.7శాతం తెలంగాణ నుంచే కావడం గమనార్హం. ఆర్థిక వ్యవస్థ బలోపే తానికి వ్యవసాయ రంగం ప్రాధాన్యత రంగంగా మారింది. 2015నుంచి వ్యవసాయ రంగంలో పెట్టుబడులు 240శాతం పెరగడం తెలంగాణలో ఈ రంగానికి ఉన్న ప్రాధాన్యత, ప్రభుత్వం కల్పిస్తున్న ఆదరణకు సూచీగా మారింది. సూక్ష్మ, మధ్యతరగతి, చిన్నతరహా సంస్థలు ఇప్పుడు పునరుజ్జీవనంలో ఉన్నాయి.

ఉద్యోగ కల్పనలో, పెట్టుబడుల గమ్యస్థానంగానూ ఇవి వర్ధిళ్లుతున్నాయి. ఇక ఔషధ రంగంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న తెలంగాణ నుంచి దేశీయ ఔషధ ఉత్పత్తిలో ఐదింట రెండు తెలంగాణ నుంచే అనే స్థాయికి చేరింది. 83 ఐటీ సెజ్లతో దేశంలోనే అతిపెద్ద ఐటీ సెజ్‌ క్లస్టర్‌, యాపిల్‌, అమెజాన్‌, ఫేస్‌బుక్‌, మైక్రోసాఫ్ట్‌, ఉబర్‌, గూగుల్‌, క్యాల్‌కాం సంస్థలకు చెందిన విదేశీ క్యాంపస్‌లు హైదరాబాద్‌లోనే కొలువై ఉన్నాయి. వీటితో ద్వితీయ, తృతీయ రంగాల్లో కూడా పురోగతి సాధ్యమవుతు న్నది. ఫుడ్‌ ప్రాసెసింగ్‌, మెగా క్లస్టర్లు, కుల వృత్తులకు ఆదరణ వంటి అనేక ఉత్పాదక ప్రోత్సాహక విధానాలు తెలంగాణ ఆర్థిక చోదక శక్తులగా మారాయి. ఫలితంగా ఇప్పుడు బడ్జెట్‌ లక్ష్యాల చేరిక పెద్దగా ఇబ్బందులు లేకుండా సాఫీగా ముందుకు సాగుతున్నది. అందుకే అనేక రాయితీలు, సంక్షేమ పథకాలు, రైతు రుణమాఫీ, రైతుబంధు వంటి పథకాలు ఎక్కడా ఆర్థిక ఇబ్బందులు లేకుండా ముందుకు సాగుతున్నాయి. ఈ ఏడాది ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మరిన్ని కొత్త పథకాలను కూడా బీఆర్‌ఎస్‌ ప్రవేశపెట్టేందుకు యోచిస్తోంది. ఇందుకు ముందుగానే ఆర్థిక వనరుల సమీకరణ, లభ్యతపై దృష్టి సారించింది. ముందస్తు పకడ్బందీ ప్రణాళికలతో ఆర్థికంగా అవరోధాలు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement