Saturday, November 23, 2024

అతిపెద్ద వెబ్‌టూన్ యాప్‌ను ప్రారంభించిన టూన్‌సూత్ర

హైదరాబాద్ : టూన్‌సూత్ర దేశంలోనే అతిపెద్ద వెబ్‌టూన్ యాప్‌ను ప్రారంభించింది. దీనిని భారతీయ వినియోగదారులందరూ ఆండ్రాయిడ్ అండ్ ఐఓఎస్ పై యాక్సెస్ చేయవచ్చు. ఆస్వాదించవచ్చు. వెబ్‌టూన్ ప్లాట్‌ఫారమ్‌లు ప్రపంచవ్యాప్తంగా అత్యంత ఆదరణ పొందుతున్నాయి. 2030 నాటికి ప్రపంచ వ్యాప్తంగా యూఎస్ 60 బిలియన్లకు ఇది వృద్ధి చెందుతుందని అంచనా.

ఈసంద‌ర్భంగా గ్రాఫిక్ ఇండియా సహ వ్యవస్థాపకుడు అండ్ సీఈఓ శరద్ దేవరాజన్ మాట్లాడుతూ… భారతదేశం అంతటా లక్షలాది మందిని ఒకే చోటకు చేరుస్తూ పాప్-కల్చర్ వినోదం కొత్త వేవ్‌ను ప్రారంభించాలని టూన్‌సూత్ర యోచిస్తోందన్నారు. కామిక్స్, వెబ్‌టూన్‌లు, యానిమేషన్, జానర్, ఫిక్షన్ అంతటా అభిమానుల అతిపెద్ద కమ్యూనిటీని నిర్మించడం లక్ష్యంగా చేసుకుందన్నారు. స్ట్రీమింగ్ వీడియో విప్లవంతో మనం చూసినట్లే, భారతదేశ వినోద ప్రేక్షకులు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక రకాల అత్యుత్తమ కంటెంట్‌ను అనుభవించడానికి, ప్రయోగాలు చేయడానికి ఆసక్తిగా ఉన్నారన్నారు.

టూన్‌సూత్ర సహ వ్యవస్థాపకుడు అండ్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్‌ విశాల్ ఆనంద్ మాట్లాడుతూ… వెబ్-టూన్ మొబైల్ కామిక్ స్పేస్ ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పొందుతుందన్నారు. 2030 నాటికి యూఎస్ 60 బిలియన్లకు చేరుకుంటుందని అంచనా అన్నారు. భారతదేశపు 700 మిలియన్ల భారీ యువ మార్కెట్ కొత్త, ఆకర్షణీయమైన, అధిక-నాణ్యత అనుభవాల కోసం వెతుకుతోందన్నారు. టూన్‌సూత్ర వెబ్-టూన్ బైట్-సైజ్ ఫార్మాట్ ఈ రోజు వినోదాన్ని చాలా భిన్నంగా వినియోగించే ఈ యువ వినియోగదారుని ఆకర్షిస్తుందన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement