Monday, September 16, 2024

HYD: రేపు జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్ధి అజారుద్దీన్ నామినేషన్

జూబ్లీహిల్స్ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థిగా తాను రేపు నామినేషన్ వేస్తున్నట్లు అభ్యర్థి అజారుద్దీన్ వెల్లడించారు. ఇవాళ శ్రీనగర్ కాలనీలోని ఎన్నికల కార్యాలయంలో జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో అజారుద్దీన్ మాట్లాడారు. కృష్ణకాంత్ పార్కు నుండి సాగర్ సొసైటీ వరకు భారీ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. కాంగ్రెస్ కార్యకర్తలు సైనికుల్లా పనిచేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు ఉపేందర్ రెడ్డి, భవానీ శంకర్, టీజేఎస్ నాయకులు సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement