కోకా-కోలా ఇండియా బిలియన్ డాలర్ స్వదేశీ బ్రాండు థమ్స్ అప్, భారతదేశం 75 సంవత్సరాల స్వాతంత్ర్య దినోత్సవాన్ని స్మరించుకుంటూ ఒక కొత్త క్యాంపెయిన్ కి తెరలేపింది. ఈ క్యాంపెయిన్ హర్హాథ్ తూఫాన్. అనేక సంవత్సరాల పాటు భారతదేశ నిర్మాణానికి తమ స్వహస్తాలతో కృషి చేసి – మన జాతి ప్రతిష్టకు నిజమైన దీప స్థంభాలై వెలుగొందిన స్ఫూర్తిదాయకులైన వ్యక్తులను ఘనంగా శ్లాఘిస్తుంది. ఈకొత్త క్యాంపెయిన్ పై కోకా-కోలా ఇండియా అండ్ సౌత్వెస్ట్ ఏషియా స్పార్క్లింగ్ ఫ్లేవర్స్ కేటగరీ, సీనియర్ డైరెక్టర్ టిష్ కాండెనో మాట్లాడుతూ… ఇండియా చిహ్నాత్మక స్వదేశీ జనన బ్రాండులలో ఒకటిగా, థమ్స్ అప్ ఎల్లప్పుడూ శక్తి, నియత విలువలకు ముందుభాగంలో నిలిచిందన్నారు. ఒలంపిక్, పారాలింపిక్ గేమ్స్ భాగస్వామ్యంతో థమ్స్ అప్యొ 2021 పలాట్దే క్యాంపెయిన్, విపరీతమైన అభిమానం, ప్రశంసలను పొందిందన్నారు.
మాజీ భారత జాతీయ క్రికెట్ జట్టు కెప్టెన్ అండ్ ప్రస్తుత బిసిసిఐ అధ్యక్షులు సౌరవ్ గంగూలీ మాట్లాడుతూ… 2017 నుండీ బ్రాండ్ అంబాసిడర్ గా కోకా-కోలా ఇండియాతో అనుబంధం కలిగి ఉండడం పట్ల తనకు ఎంతో గర్వంగా ఉందన్నారు. ఇండియా 75వ స్వాతంత్ర్య దినోత్సవ సంబరాలను అందంగా కొనియాడే థమ్స్ అప్ కొత్త క్యాంపెయిన్ హర్హాథ్తూఫాన్ భాగమైనందుకు తాను ఎంతగానో ఆనందిస్తున్నానన్నారు. ఓజిల్వీ ఇండియా నార్త్, ఛీఫ్ క్రియేటివ్ అధికారి రీతూ శారద మాట్లాడుతూ… గత 75 సంవత్సరాల పాటు భారతదేశం సమర్థతను కొందరు తక్కువ చేసి జోస్యం చెప్పినప్పుడల్లా, దేశభక్తులు ముందుకు వచ్చి వాటిని తలక్రిందులు చేస్తూ పలాట్దే చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయన్నారు.