Friday, November 22, 2024

ఆ గోవులను గోశాలలకు తరలించాలి.. సీపీకి వీహెచ్‌పీ విజ్ఞప్తి

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : బక్రీద్‌ సందర్భంగా గోహత్యలకు కొంత మంది సిద్దమయ్యారని, దీన్ని నివారించేందుకు పోలీసు శాఖ మరిన్ని చర్యలు తీసుకోవాలని విశ్వ హిందూ పరిషత్‌ (వీహెచ్‌పీ) హైదరాబాద్‌ సీపీ సీవీ ఆనంద్‌కు వినతి పత్రం సమర్పించింది. పాతబస్తీలోని ప్రతి ఇంటి ముందు ఒక గోవును కట్టేశారని, వాటన్నింటినీ వెంటనే గోశాలలకు తరలించాలని డిమాండ్‌ చేశారు. వేలకొద్ది ఆవులను వధించేందుకు తరలిస్తున్న పోలీసు యంత్రాంగం చర్యలు తీసుకోకపోవడం పట్ల వారు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. పోలీసులు చెక్‌పోస్టులున్నా ఫలితం లేదని, ఏ ఒక్క చెక్‌పోస్టులోనూ ఇంత వరకు ఒక్క ఆవును కాపాడిన దాఖలాలు లేవన్నారు.

బక్రీద్‌ సందర్భంగా లక్షల కొద్ది ఆవులు, ఎద్దులు, దూడలను వధశాలలకు తరలిస్తుంటే జంతు ప్రేమికులు కూడా స్పందించకపోవడం బాధాకరమని పేర్కొన్నారు. ముక్కోటి దేవతలకు నిలయంగా భావించే గోవును వధిస్తున్నా కూడా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేసారు. హిందువులపై ఎందుకు ఇంత వివక్ష సాగతుందని వారు ప్రశ్నించారు. ఇప్పటికైనా రాష్ట్ర పోలీసులు స్పందించి ఎక్కడికక్కడే ఆవులను కాపాడి వాటిని గోశాలలకు తరలించాలని డిమాండ్‌ చేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement