తెలంగాణ రాష్ట్ర సాధనకు పోరుబాట చూపిన సిద్ధాంతకర్త ప్రొ.జయశంకర్ సార్ అని నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మీ అన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతి సందర్భంగా తెలంగాణ భవన్ లో ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. జయశంకర్ సార్ చూపిన మార్గం, ఉద్యమ పాఠాలు, చైతన్యం.. యావత్తు తెలంగాణ సమాజం గుండెల్లో చిరస్మరణీయంగా నిలిచిపోతారని అన్నారు. సార్.. ఆశించినట్లుగా స్వయం పాలన సాకరమై, సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. ఈ కార్యక్రమంలో నగర మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement