Tuesday, November 26, 2024

కేసీఆర్ ప్రభుత్వం వచ్చాకే మెరుగు పడిన పోలీస్ వ్యవస్థ… ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డాక పోలీస్ వ్యవస్థ ఎంతో మెరుగుపడిందని ఎల్బీ నగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి తెలిపారు. నేను సహితం నేర రహిత సమాజం కోసం అనే సంకల్పంతో తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఎల్బీ నగర్ నియోజకవర్గ అభివృద్ధి కోసం పరితపించే నాయకులు, ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఎమ్మెల్యే నిధుల నుంచి సుమారు ఐదు కోట్ల రూపాయలు, అదనంగా మరో ఇద్దరు ఎమ్మెల్సీలు ఎగ్గే మల్లేశం, దయానంద్ గుప్తా ల నిధులు రెండు కోట్ల రూపాయలు మొత్తం ఏడు కోట్ల రూపాయలతో నియోజకవర్గ పరిధిలో 104 కాలనీల నందు సుమారు 1080 కెమెరాలతో పకడ్బందీ వ్యవస్థ స్థాపించే విధంగా ముందుకు వెళ్తున్నారు. దానిలో భాగంగా ఈ రోజు చంపాపేట్ డివిజన్ కర్మన్ ఘాట్ క్రాంతి క్లబ్ గ్రౌండ్ నందు సీ.సీ.కెమెరాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాచకొండ పోలీస్ కమిషనర్ డి.ఎస్.చౌహన్, ఎల్.బి.నగర్ శాసనసభ్యులు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి, ఎమ్మెల్సీలు ఎగ్గే మల్లేశం, దయానంద్ గుప్తా లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… ఒక్క సీ.సీ.కెమెరా 100 మంది పోలీసులతో సమానమన్నారు. తప్పు చేయాలంటే దొంగలు భయపడే రోజులు వచ్చాయని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డాక పోలీస్ వ్యవస్థ ఎంతో మెరుగుపడిందని తెలిపారు. కమాండ్ కంట్రోల్ భవనం దేశానికే తలమానికమని తెలిపారు. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసులు చేస్తున్న కృషిని, ఫ్రెండ్లీ పోలీస్ విధానాన్ని, రాష్ట్ర పోలీసు శాఖ సమర్ధవంతమైన సేవలను అందిస్తుందని కొనియాడారు. శాంతి భద్రతలు ఎక్కడైతే పటిష్టంగా ఉంటాయో, ఆ ప్రాంతం బాగుపడుతుందని భావించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ పోలీస్‌శాఖలో ఎన్నో సంస్కరణలు చేశారు.

అందులో భాగంగా విప్లవాత్మక మార్పులు తేవడంతో పాటు పోలీసులు కఠినంగా వ్యవహరిస్తారనే అపవాదును తొలగించేందుకు ఫ్రెండ్లీ పోలీసింగ్ కు శ్రీకారం చుట్టారు. 24 గంటలూ విధులు నిర్వర్తించే పోలీసులు ఎదుర్కొంటున్న సమస్యలపై సమగ్ర అధ్యయనం చేసి, వాటి పరిష్కారానికి కృషి చేశారు. ప్రతి ఠాణాకు కావాల్సినంత సిబ్బందిని నియమించారు. ఆధునిక వాహనాలను సమకూర్చడమే కాకుండా, మహిళల భద్రతకు షీ టీంలను రంగంలోకి దించారు. అన్ని జిల్లాల్లోనూ మహిళా ఠాణాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేసి భరోసా కల్పించగా, సీఎం ఆలోచనలకు గుణంగా ప్రభుత్వం పోలీసుశాఖను మరింత బలోపేతం చేసింది. ఈ కార్యక్రమంలో ఎల్బీ నగర్ జోన్ డీసీపీ సాయిశ్రీ, ఏసీపీ జానకి రెడ్డి, సీనియర్ నాయకులు గజ్జల మధుసూధనరెడ్డి, మాజీ కార్పొరేటర్లు ముద్రబోయిన శ్రీనివాసరావు, సాగర్ రెడ్డి, జిన్నారం విఠల్ రెడ్డి, కర్మన్ ఘాట్ హనుమాన్ దేవాలయం చైర్మన్ నల్ల.రఘుమారెడ్డి, కృష్ణమాచారి, ఓరుగంటి వెంకటేష్, పలు డివిజన్ల అధ్యక్షులు, మహిళా అధ్యక్షురాళ్లు, సీనియర్ నాయకులు, మాజీ అధ్యక్షులు, ఉద్యమకారులు, మహిళలు, పలు విభాగాల కమిటీ అధ్యక్ష, కార్యవర్గ సభ్యులు, కార్యకర్తలు, పలు కాలనీల అధ్యక్ష, కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement