Friday, November 22, 2024

Big story | తప్పులు నిజమే, సవరిస్తేనే మేలు.. ధరణిపై త్వరలో పున:సమీక్ష

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : స్వల్పంగా మొరాయిస్తున్న సమస్యలను సైతం దారికితెచ్చి ధరణి దిద్దుబాటుతో లక్ష్యం చేరాలని ప్రభుత్వం భావిస్తోంది. ధరణి పోర్టల్‌లో ఉన్న బాలారిష్టాలు, ఇంకా తొలగిపోని కొన్ని సమస్యలను కరూడా రూపుమాపి సరికొత్త ధరణిని సాక్షాత్కరించేందుకు యంత్రాంగం జోరుగా శ్రమిస్తోంది. ధరణిని దారికితెచ్చేందుకు ఉన్న పలు అవకాశాలను పరిశీలించిన ప్రభుత్వం కీలక ఆదేశాలను జారీ చేసింది.

కొత్త పాస్‌ పుస్తకాలు ఉంటేనే రిజిస్ట్రేషన్లకు ప్రస్తుతం అవకాశం ఉంది. అయితే పలు కారణాలతో 6లక్షలకుపైగా ఖాతాలకు చెందిన రైతులకు పట్టాదార్‌ పాస్‌ పుస్తకాలు అందలేదు. డిజిటల్‌ సిగ్నేజెర్‌ పెండింగ్‌, ఆధార్‌ సీడింగ్‌ కానీ భూములకు పాస్‌ పుస్తకాలు దక్కలేదు.

- Advertisement -

-ఎవరైనా పట్టాదారు తన వ్యవసాయ భూమిని బ్యాంకులకు మార్టిగేజ్‌ చేసి రుణం తీసుకున్న అనంతరం మరణిస్తే ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కుటుంబ సభ్యులు అప్పు తీర్చేసినా సదరు భూమి మార్టిగేజ్‌ నుంచి రిలీజ్‌ కావడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. చనిపోయిన వ్యక్తి ఉంటేనే మార్టిగేజ్‌ రిలీజ్‌ అవుతోంది. ఇది అతిపెద్ద సమస్యగా ఉన్నది.

-మాజీ సైనికులు, స్వాతంత్య్ర సమర యోధులు, పొలిటికల్‌ సఫరర్స్‌కు ప్రభుత్వం అసైన్‌ చేసిన భూములను ధరణి పోర్టల్‌లో నిషేదిత జాబితాలో నమోదు చేశారు. దీంతో విక్రయాలు నిల్చిపోయాయి. ఎన్వోసీ కావాలంటే అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

-అగ్రికల్చర్‌, నాన్‌ అగ్రికల్చర్‌ రిజిస్ట్రేషన్లు రెండు భిన్నమైన యంత్రాంగాల వద్ద రిజిస్టర్డ్‌ అవుతుండటంతో కొన్ని భూములు డూప్లికేట్‌కు ఆస్కారంగా మారుతున్నాయి. అనేక విలువైన జిల్లాల్లో వ్యవసాయ భూములు రియల్‌ వ్యాపారం దిశగా మారిపోయి విల్లాలు, వెంచర్లుగా మారినా ఇంకా అవి వ్యవసాయ భూములుగా ధరణిలో ఉండిపోయాయి. వీటికి రైతుబంధు కూడా అందుతోంది.

-కొందరు పట్టదారులు ధరణి రాకముందు విక్రయించిన భూముల యాజమాన్య హక్కులు మారకపోవడంతో ధరణి వచ్చాకా రెండోసారి రిజిస్ట్రేషనల్‌ఉ చేస్తున్నారు. భూ రికార్డుల ప్రక్షాళనలో పేర్లు ఎక్కించుకోని వారి భూములు ఇప్పుడు మ్యుటేషన్‌ కావడంలేదు.

-ఇద్దరికంటే ఎక్కువమంది కలిసి పార్ట్‌ నర్లుగా కొనుగోలు చేసిన భూములు జాయింట్‌ రిజిస్ట్రేషన్‌ కావడంలేదు.

దస్త్రాల్లో ఏ సమాచారం ఉంటే దాని ఆధారంగా రిజిస్ట్రేషన్‌, మ్యుటేషన్‌ చేయడం ధరణి విధానం. ఇదే ఇప్పుడు వివాదాలకు కారణమవుతోంది. అసలు హక్కుదారులు ఆమేనని, భూమి వేరేవారి పేర్లతో బదలీ అయిందని, వారు చేసే లావాదేవీలను అనుమతించొద్దని బాధితులు చేస్తున్న ఆర్తనాదాలకు విలువ లేకుండా పోతోంది. రిజిస్ట్రేషన్లు జరిగిపోతున్నాయి. దీంతో అసలు యాజమానులు దిక్కుతోచని స్థితికి వెళుతున్నారు. ధరణి పోర్టల్‌ అద్భుతంగా ఉన్నప్పటికీ ఎప్పటికప్పుడు తలెత్తే పలు సమస్యలకు తక్షణమే స్పందించేలా మధ్యవర్తిత్వ (అంబుడ్స్‌మెన్‌) ఏర్పాటు తెరపైకి వస్తోంది.

-భూ యజమానాఉలకు తెలియకుండానే లావాదేవీలు పూర్తయ్యే విధానాన్ని నియంత్రించాల్సి ఉంది. ఇందుకు ధరణిలో ఒక విధానం లేదు.

-ధరణి లొసుగులు అక్రమార్కులకు వరంగా మారుతున్నాయి. సక్రమమైన లావాదేవీల అంశంలో ఎటువంటి గందరగోళ: లేకపోయినా, తప్పుడు డాక్యుమెంట్లు, స్లాట్ల నమోదుతలో తేడాలతో ప్రస్తుతం ఉన్న యజమానికి బదులుగా పాత యజమాని పేరుతో దొడ్డిదారి లావాదేవీలు నడుస్తున్నాయి. ఇలా నల్గొండ, వికారాబాద్‌, నాగర్‌కర్నూలు, రంగారెడ్డి, పెద్దపల్లి జిల్లాల్లో జరిగినట్లుగా ఫిర్యాదులందాయి.

-ఇక పలు ధరణి సమస్యల పరిష్కారంలో తహశీల్దార్లు సంతకాలే ప్రామాణికం కావడంతో, కలెక్టర్లు కిందిస్థాయి రిపోర్టులకు భిన్నంగా క్లీయరెన్సులు జారీ చేయడంపై భిన్నాభిప్రాయలు వస్తున్నాయి. దీంతో రెవెన్యూ వ్యవస్థలో, పాలనలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. సహకార లేమి ఎదురవుతోంది.

-టీఎం-33 దరఖాస్తుల పరిశీలన, క్లీయరెన్స్‌ల జాప్యం అనివార్యంగా మారింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement