Saturday, November 23, 2024

ఒయాసిస్ ఫెర్టిలిటీలో అద్భుతం – మ‌గ శిశువుకు జ‌న్మ‌నిచ్చిన ప్రేమ

కోవిడ్‌ మహమ్మారితో భర్తను కోల్పోయిన బాధ.. దాంతో పాటు సంతానం కూడా లేకపోవడంతో ఆ ఇల్లాలి మనసు ముక్కలైపోయింది. కానీ డాక్టర్ జలగం కావ్య రావు, క్లినికల్ హెడ్ అండ్ ఫెర్టిలిటీ స్పెషలిస్ట్, ఒయాసిస్ ఫెర్టిలిటీ, వరంగల్ తన సానుభూతి ప్రయత్నం, నిబద్ధత కారణంగా, ఇప్పుడు ప్రేమ (పేరు మార్చబడింది) ఒక మగ శిశువుకు సంతోషకరమైన తల్లిగా మారింది.

ఈ సందర్భంగా వరంగల్ ఒయాసిస్ ఫెర్టిలిటీ క్లినికల్ హెడ్ అండ్ ఫెర్టిలిటీ స్పెషలిస్ట్ డాక్టర్ జలగం కావ్యరావు మాట్లాడుతూ… ప్రేమకు మాతృత్వ మాధుర్యాన్ని బహుమతిగా ఇచ్చినందుకు త‌నకు చాలా సంతోషంగా ఉందన్నారు. విధివశాత్తు ఆమెకు అపారమైన నష్టం జరిగినప్పటికీ, త‌మ ప్రయత్నాలు, అధునాతనమైన సంతానోత్పత్తి చికిత్స ప్రక్రియల శక్తి ద్వారా, అటువంటి దురదృష్టకర పరిస్థితుల్లో కూడా ఆమె తల్లి కావడానికి సహాయం చేయడం ద్వారా ప్రేమ జీవితంలో తాము సరికొత్త ఆశను చిగురింప చేయగలిగామన్నారు. ఈ సానుకూల ఫలితంతో ఒయాసిస్ టీమ్ మొత్తం ఎంతో ఉప్పొంగిపోయిందన్నారు. ఒయాసిస్ ఫెర్టిలిటీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ సుధాకర్ జాదవ్ మాట్లాడుతూ… తాము సాంకేతికత శక్తిని సంపూర్ణంగా విశ్వసిస్తున్నామన్నారు. భారీ, సానుకూల పరివర్తనను తీసుకురావడానికి దానిని తాము ఉపయోగిస్తామన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement