Sunday, September 15, 2024

TG | త‌గ్గుముఖం ప‌ట్ట‌నున్న వాన‌లు…

ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో వాగులు, వంకలు, నదులు ఉగ్రరూపాన్ని దాల్చాయి. లోతట్టు ప్రాంతాలన్ని జలమయమవ్వ‌డంతో ప్ర‌జ‌లు అతలాకుతలమవుతున్నాయి. ఇప్పటికే చాలా చోట్ల రాకపోకలు బందయ్యాయి.

కాగా, వాతావరణ శాఖ తాజాగా ఇచ్చిన సమాచారంతో వ‌ర్షాల‌తో అల్లాడుతున్న ప్ర‌జ‌ల‌కు కాస్త‌ ఉపశమనం కలిగినట్టయింది. అల్పపీడనం వేగంగా ముందుకు కదులుతుండటంతో.. రేపటి వరకు భారీ వర్షాలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.

ఇక.. హైదరాబాద్‌లో కుండపోత వర్షాలు కురుస్తాయని ముందుగా హెచ్చరించగా.. ఆ గండం కాస్త తప్పినట్టే కనిపిస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. భారీ అల్పపీడనం ఎట్టకేలకు హైదరాబాద్ నగరాన్ని దాటి వెళ్లిపోతుండటంతో.. ప్రమాదమేమి లేదని చెప్తున్నారు. అయినప్పటికీ హైదరాబాద్‌కు ఆరెంజ్ అలెర్ట్ కొనసాగుతోంది. మూసీ నదికి భారీగా ఇన్ ఫ్లోలు వస్తున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement