హైదరాబాద్, ప్రభన్యూస్ : బయోగ్యాస్ ప్లాంట్ల రంగంలో దొడ్ల డెయిరీ అందించిన సేవలను ఇండియన్ బయో గ్యాస్ అసోసియేషన్ గుర్తించింది. బయోగ్యాస్ ప్లాంట్ల ఆపరేటర్లు, తయారీదారులు, ప్లానర్లు ఈఈ అసోసియేషన్‌లో సభ్యులుగా ఉన్నారు. డెయిరీ వ్యర్థాలతో సహా ఉత్పత్తి అవుతున్న ఎన్నో టన్నుల సేంద్రియ వ్యర్థాలను ఈఈ కంపెనీ ఉపయోగించుకోగలిగింది. ఈసందర్భంగా అవార్డును స్వీకరించిన సందర్భంగా దొడ్ల డెయిరీఈ సీఈఓ బీవీకే రెడ్డి మాట్లాడుతూ… తాము అందించే ఉత్పత్తులు, సేవల ద్వారా ఒక సామాజిక ప్రభావం కలిగించడంపై తాము దృష్టి పెట్టామన్నారు.
ప్రజలు బాగా ఉపయోగించే వస్తువులకు సంబంధించి అతిపెద్ద ప్రైవేటు సంస్థల్లో తమది ఒకటన్నారు. తాము చేపట్టే కార్యక్రమాలు పర్యావరణ హితంగా ఉండాలని తాము కోరుకుంటున్నామన్నారు. అలాంటి ప్రయత్నాలకు లభించిన పురస్కారమే ఈ అవార్డు అన్నారు. తమ ప్రయత్నాలను గుర్తించినందుకు గానూ ఇండియన్ బయోగ్యాస్ అసోసియేషన్‌కు ధన్యవాదాలు తెలిపారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..