Friday, November 22, 2024

ఇనార్బిట్ మాల్ లో పిల్ల‌ల‌కు మొద‌టి వ్యాక్సినేష‌న్‌

హైదరాబాద్‌లోని తల్లిదండ్రులు తమ 15–18 సంవత్సరాల వయసు కలిగిన చిన్నారులను తీసుకుని ఇనార్బిట్‌ మాల్‌ను సందర్శించడం మాత్రమే కాదు వారికి కోవిడ్‌ –19కు వ్యతిరేకంగా వ్యాక్సిన్‌ తొలి మోతాదును పూర్తి ఉచితంగానూ అందించవచ్చు. హైదరాబాద్‌లోని ఓ సుప్రసిద్ధ హాస్పిటల్‌తో ఇనార్బిట్‌ మాల్‌ హైదరాబాద్‌ భాగస్వామ్యం చేసుకోవడంతో పాటుగా జనవరి, ఫిబ్రవరి నెలల్లో ఈ వ్యాక్సినేషన్‌లను మాల్‌లో అందించనుంది. ప్రతి రోజూ ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ ఈ వ్యాక్సినేషన్‌ కార్యక్రమం జరుగనుంది.

ఈసంద‌ర్భంగా హైద‌రాబాద్ ఇనార్బిట్ మాల్ సెంట‌ర్ హెడ్ శ‌ర‌త్ బెలావ‌డి మాట్లాడుతూ… ఇనార్బిట్‌ మాల్‌ హైదరాబాద్‌ వద్ద, వీలైనన్ని మార్గాల్లో త‌మ వినియోగదారులకు సంతోషంగా సేవలనందించాలని కోరుకుంటుంటామన్నారు. తల్లిదండ్రులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడంతో పాటుగా సురక్షితమైన, ఆరోగ్యవంతమైన, స్వచ్ఛమైన వాతావరణం కలిగిన ఇనార్బిట్‌ వద్ద తమ పిల్లలకు టీకాలను అందించడం, అదీ పూర్తి ఉచితంగా అందించడం జ‌రుగుతుంద‌న్నారు. ఈ వ్యాక్సినేషన్‌ శిబిరం గురించిన మరింత సమాచారం కోసం 80080 45704 సంప్రదించవ‌చ్చ‌న్నారు. ఈ వ్యాక్సిన్ క్యాంప్‌లో తమ పిల్లలకు టీకాలను వేయించాలనుకునే తల్లిదండ్రులు ఆరోగ్య సేతు యాప్‌లో ముందుగా తమ పిల్లల పేర్లను నమోదు చేయడంతో పాటుగా తమ పిల్లల ఆధార్‌ కార్డులను సైతం తమతో పాటుగా తీసుకురావాల్సి ఉంటుందన్నారు. తద్వారా వారు మొదటి మోతాదు టీకాను తమ పిల్లలకు అందించవచ్చన్నారు. టీకా తీసుకున్న వ్యక్తులు ఏదైనా అసౌకర్యం ఎదుర్కొంటే టీకా ప్రాంగణం వదిలి వెళ్లేందుకు ఖచ్చితంగా 30 నిమిషాలు వేచి ఉండాల్సి ఉంటుందని, అవసరమైన రోగులకు సహాయమందించేందుకు డాక్టర్లతో కూడిన ఓ బృందం అందుబాటులో ఉంటుందన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

- Advertisement -

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement