మాగ్నమ్ వింగ్స్ ఎల్ఎల్పీ బుధవారం తమ మొట్టమొదటి వాణిజ్య యుఏవీ (మానవ రహిత విమాన వాహనం)– ఎండబ్ల్యు వైపర్‌ను విడుదల చేసింది. ఈ ఆవిష్కరణ సందర్భంగా మాగ్నమ్ వింగ్స్ ఎల్ఎల్పీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అభిరామ్ చావా మాట్లాడుతూ… భారత ప్రభుత్వ మేక్ ఇన్ ఇండియా లక్ష్యంలో భాగం కావడం పట్ల సంతోషంగా ఉన్నామన్నారు. ఈ యుఏవీలను భారతదేశంలో అసెంబెల్ చేయలేదు కానీ వీటిని ఇక్కడే తీర్చిదిద్దడం జరిగిందన్నారు. వీటిలో అత్యధిక భాగాలను ఇండియాలోనే సేకరించడం జరిగిందన్నారు. ఎండబ్ల్యు వైపర్‌ను వాణిజ్య వినియోగానికి అందుబాటులో ఉంచిన తరువాత దీనిని బీపీసీఎల్, గోయెంకా, ఎస్బీఐ, ఎన్జీఆర్ఐ తదితర సంస్ధల ముంగిట ప్రదర్శించామని అన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement