తెలుగు వినోద రంగంలో నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ అంటే అందరికీ గుర్తుకువచ్చేది వన్ అండ్ ఓన్లీ జీ తెలుగు. ఎప్పటికప్పుడు విభిన్నమైన కార్యక్రమాలను అందిస్తూ తెలుగు ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటోంది జీ తెలుగు. తెలుగు ప్రేక్షకుల్ని అనునిత్యం ఎంటర్ టైన్ చేస్తున్న జీ తెలుగు 17 ఏళ్లు పూర్తి చేసుకుని మరో మైలురాయిని అధిగమించింది. ప్రతీ సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా జీ తెలుగు ఆవిర్భావ దినోత్సవం వేడుకలు అంబరాన్నంటాయి. జీ తెలుగు మహోత్సవం పేరుతో నిర్వహించిన ఈ కార్యక్రమం జీ తెలుగులో మే 22 సాయంత్రం 6 గంటల నుంచి ప్రసారం కానుంది. ఈ సందర్భంగా జీ తెలుగు చీఫ్ కంటెంట్ హెడ్ అనురాధ గూడూరు మాట్లాడుతూ.. రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రేక్షకులకు విభిన్నమైన, వినూత్నమైన వినోదాన్ని అందించే ఉద్దేశంతో జీ తెలుగును ప్రారంభించామన్నారు. ఛానెల్ ప్రారంభించిన దగ్గర నుంచి తెలుగు ప్రేక్షకులు మెచ్చే వినోదాన్ని అందిస్తూనే ఉన్నామన్నారు. ఈ సందర్భంగా తమకు ప్రేక్షకుల నుంచి కూడా అద్భుతమైన మద్దతు, ప్రేమ లభించిందన్నారు. ఇదే మమ్మల్ని ఎంటర్ టైన్ రంగంలో తిరుగులేని శక్తిగా నిలబడేలా చేసిందన్నారు. నిరంతరాయంగా తమకు మద్దతు ఇస్తూ మమ్మల్ని వెన్నుతట్టి ప్రోత్సహిస్తున్న తెలుగు ప్రేక్షకులకు తాము కృతజ్ఞతలు చెప్పుకోవాల్సిన అవసరముందన్నారు. 17 ఏళ్లు పూర్తైన సందర్భంగా ఏర్పాటు చేసిన జీ తెలుగు మహోత్సవం ద్వారా తమకు అలాంటి అవకాశం దక్కిందన్నారు. ఆకట్టుకునే ఆటపాటలు, అదిరిపోయే మెస్మరైజింగ్ పర్ఫార్మెన్స్ తో కూడిన జీ తెలుగు మహోత్సవం మరోసారి ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుందని భావిస్తున్నట్లు ఆమె తెలిపారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement