Tuesday, November 19, 2024

HYD: అన్ని విధాలుగా అభివృద్ధి చేశా.. మరోసారి గెలిపించండి.. సుధీర్ రెడ్డి

కర్మన్ ఘాట్, ఆగస్టు 30 (ప్రభ న్యూస్) : కోట్లాది రూపాయలు మంజూరు చేయించి హస్తినాపూర్ డివిజన్ ను అన్ని విధాలుగా అభివృద్ధి చేసినట్లు ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి అన్నారు. హస్తినాపురం డివిజన్ పరిధిలోని జయకృష్ణ ఎంక్లేవ్ లో నూతనంగా నిర్మించిన కమ్యూనిటి హాల్ ను కాలనీ సంక్షేమ సంఘం అధ్యక్షులు అనుగుల శ్రీనివాస్ రెడ్డితో కలిసి ఎల్.బి.నగర్ శాసనసభ్యులు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మాట్లాడుతూ… కాలనీలో ఐదు కోట్లతో ఇండోర్స్ స్విమ్మింగ్ పూల్ నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు. డివిజన్ లోని 62కాలనీల్లో గతంలో రిజిస్ట్రేషన్స్ పర్మిషన్ సమస్యతో కాలనీవాసులు ఇబ్బందులు పడుతున్న విషయాన్ని తెలుసుకొని ఉడా చైర్మన్ గా ఉన్నప్పుడు నాటి ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి సహకారంతో సమస్యను పరిష్కరించినట్లు తెలిపారు.

ప్రతి డివిజన్ లో పార్కుల సుందరీకరణతో పాటు స్విమ్మింగ్ పూల్స్ నిర్మించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. సీనియర్ సిటిజన్స్, యువత కోసం ఖాళీ స్థలాల్లో ఓపెన్ జిమ్స్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. జై చంద్రారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ దేవిరెడ్డి కమల సుధీర్ రెడ్డి మాట్లాడుతూ… రాబోయే ఎన్నికల్లో దేవిరెడ్డి సుధీర్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. గత 30 సంవత్సరాలుగా నియోజకవర్గంలో అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్న దేవిరెడ్డి సుధీర్ రెడ్డిని మరొకసారి గెలిపిస్తే ఎల్బీనగర్ నియోజకవర్గం రాష్ట్రంలోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతారని తెలిపారు. కాలనీల అభివృద్ధితోపాటు జాబ్ మేళా నిర్వహించి నిరుద్యోగుల జీవితాల్లో వెలుగు నింపినట్లు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా గ్రంధాలయం చైర్మన్ సత్తు వెంకట రమణ, సీనియర్ నాయకులు గజ్జెల మధుసూధనరెడ్డి, మాజీ కార్పొరేటర్ పద్మ శ్రీనివాస్ నాయక్, జయచంద్ర రెడ్డి, చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ కమల సుధీర్ రెడ్డి, డివిజన్ బారాస పార్టీ అధ్యక్షుడు అందోజు సత్యంచారి, కర్మన్ ఘాట్ హనుమాన్ దేవాలయం ధర్మకర్తలు ముద్ద కళ్యాణ్ చక్రవర్తి, నారగోని శ్రీనివాస్ యాదవ్, కాలనీ అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి, గౌరవ అధ్యక్షులు సురేందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి వాసుదేవరెడ్డి, ఉపాధ్యక్షులు నర్సింహారెడ్డి, మోహన్ గౌడ్, చంద్రమోహన్ రెడ్డి, సంయుక్త కార్యదర్శులు జి.యాదయ్య, విజయభాస్కర్ రెడ్డి, పాపిరెడ్డి, విష్ణువర్ధన్ రావు, బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి నాగిరెడ్డి, శ్రీను నాయక్, శేషగిరిరావు, శ్రీరాములు, విజయ, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement