Saturday, September 21, 2024

HYD: హైదరాబాద్‌లో అతిపెద్ద ఎక్స్‌పో ఎడిషన్‌..

హైదరాబాద్‌ : అనలిటికా అనకాన్‌ ఇండియా, ఇండియా ల్యాబ్‌ ఎక్స్‌పో, ఫార్మాప్రో అండ్‌ ప్యాక్‌ ఎక్స్‌పో సెప్టెంబర్‌ 26 నుంచి 28 వరకు హైటెక్స్‌ ఎగ్జిబిషన్‌ సెంటర్‌లో జరగనుంది. ఈ సంవత్సరం నిర్వహించే కార్యక్రమంలో 14కు పైగా దేశాల నుండి 500కంటే ఎక్కువమంది టెక్నాలజీ సప్లయర్లు పాల్గొంటున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. ఫార్మాస్యూటికల్‌, ఎనలిటికల్‌, బయో టె-క్నాలజీ, ఆర్‌అండ్‌డీ రంగాలకు పరివర్తన అనుభవాన్ని సృష్టించేందుకు టైయాడ్‌ ఈవెంట్‌ రూపొందించబడింది.

రాబోయే ఎడిషన్‌ గురించి మెస్సేమున్చెన్‌ ఇండియా సీఈవొ భూపిందర్‌ సింగ్‌ మాట్లాడుతూ… అనలిటికా అనకాన్‌ ఇండియా, ఇండియా ల్యాబ్‌ ఎక్స్‌పో, ఫార్మా ప్రో అండ్‌ ప్యాక్‌ ఎక్స్‌పో అతిపెద్ద ఎడిషన్‌ను హైదరాబాద్‌లో నిర్వహిస్తున్నామని, ఇది అధునాతన సాంకేతిక పరిష్కారాలు, ఉన్నతస్థాయి చర్చలకు కీలక వేదికగా పని చేస్తుందని, పరిశ్రమ నిపుణులకు విలక్షణమైన అవకాశాన్ని అందించడానికి కట్టుబడి ఉన్నామన్నారు.

ఇండియన్‌ ఎనలిటికల్‌ ఇన్‌స్ట్రుమెంట్స్‌ అసోసియేషన్‌(ఐఏఐఏ) ప్రెసిడెంట్‌ చంద్రహాస్‌ శెట్టి మాట్లాడుతూ… అనలిటికా అనకాన్‌ ఇండియా, ఇండియా ల్యాబ్‌ ఎక్స్‌పోతో తమ దీర్ఘకాల భాగస్వామ్యం విశ్లేషణాత్మక సాధనాలు, ప్రయోగశాల సాంకేతిక రంగాలను అభివృద్ధి చేయడంలో కీలకంగా కొనసాగుతోందన్నారు.

- Advertisement -

ఇండియన్‌ ఫార్మా మెషినరీ మాన్యుఫ్యాక్చరర్స్‌ అసోసియేషన్‌ (ఐపీఎంఎంఏ) ప్రెసిడెంట్‌ హర్షిత్‌ షా మాట్లాడుతూ… భారతదేశపు అతిపెద్ద ఫార్మా మెషీన్‌ తయారీదారుల సంఘంగా, ఐపీఎంఎంఏ ఫార్మా కంపెనీలు, యంత్ర తయారీ దారులకు సవాళ్లు, భవిష్యత్తు సిద్ధమైన పరిష్కారాలను చర్చించడానికి సరైన వేదికను రూపొందించడానికి కట్టుబడి ఉందన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement