Monday, November 18, 2024

TG – రైతుల కోసం శ్ర‌మిస్తున్న సీఎం – మంత్రి తుమ్మ‌ల

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్‌, కామారెడ్డి : మా ప్ర‌భుత్వం రైతు రాజ్య‌మ‌ని, రైతుల కోసం సీఎం రేవంత్​ రెడ్డి కష్టపడుతున్నారని రాష్ట్ర వ్య‌వ‌సాయ శాఖ మంత్రి తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావు అన్నారు. శుక్ర‌వారం కామారెడ్డి జిల్లాలో వ్యవసాయశాఖా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీర్​ఎస్​ ప్రభుత్వం రైతుల గురించి పట్టించుకోకుండా ఇప్పుడు రుణామాఫీ గురించి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. రైతన్నల ఆదరణతో కాంగ్రెస్​ అధికారంలోకి వచ్చిందన్న ఆయన… ఎన్ని ఇబ్బందులు వచ్చినా.. రుణమాఫీ… రైతు భరోసా.. రైతు బీమాను అమలు చేస్తామన్నారు. రెండు లక్షల వరకు లోన్​ ఉన్న ప్రతి రైతుకు రుణమాఫీ చేస్తామన్నారు. సంక్షేమ పథకాలను అమలు పరుస్తూ.. అర్హులందరికి ఇస్తామని చెప్పారు.

రుణ మాఫీ ఆందోళ‌న వ‌ద్దు
రుణ మాఫీ విషయంలో ఎవరూ ఆందోళ‌న చెంద వ‌ద్ద‌ని మంత్రి తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావు తెలిపారు. కేవలం తెలంగాణలో కోటి 45 లక్షల టన్నుల వరిధాన్యాన్ని పండిస్తున్నారని.. ప్రతి రైతును ఆదుకొనేందుకు సీఎం రేవంత్​ రెడ్డి కష్టపడుతున్నారన్నారు. ప్రస్తుత సీజన్​ లో ఎక్కువుగా సన్నధాన్యాన్ని పండించారని.. అదనంగా రూ. 500 ఇచ్చి సన్నధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement