వికారాబాద్ : దేశాభివృద్ధిలో తెలంగాణ పాత్ర అతికీలమని అన్నారు దేశ రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ .. వికారాబాద్ జిల్లా దామగుం డం అటవీ ప్రాంతంలో వీఎల్ఎఫ్ (వెరీ లో ఫ్రీక్వెన్సీ) నేవీ రాడర్ స్టేషన్ కు రేవంత్ తో కలసి కేంద్రమంత్రి రాజ్ నాథ్ సింగ్ నేడు శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా కేంద్రమంత్రి మాట్లాడుతూ, వీఎల్ఎఫ్ (వెరీ లో ఫ్రీక్వెన్సీ) స్టేషన్కు శంకుస్థాపన చేయడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. దీనికి సీఎం రేవంత్రెడ్డి అన్నివిధాలా అండగా నిలిచారంటూ ఆయనకు ధన్యవాదాలు తెలిపారు. దేశ రక్షణ విషయంలో రాజకీయాలకు అతీతంగా అందరూ ఉండాలని అన్నారు.. రాడార్ ఏర్పాటుపై వివాదాలు రేకెత్తించవద్దని తెలంగాణలోని విపక్ష పార్టీలకు ఆయన పిలుపు ఇచ్చారు. “పార్టీలు వేరైనా దేశాభివృద్ధిలో అందరూ కలిసి ముందుకెళ్లాలి. రక్షణ రంగ పరికరాల తయారీలో హైదరాబాద్కు గొప్ప పేరుంది. దేశాభివృద్ధిలో తెలంగాణ పాత్ర కీలకంగా మారింది. భద్రత విషయంలో వీఎల్ఎఫ్ స్టేషన్ చాలా ముఖ్యమైనది. కమ్యూనికేషన్కు ఈ కమాండ్ సెంటర్ ప్రముఖపాత్ర పోషిస్తుంది” అని పేర్కొన్నారు.
TG – దేశాభివృద్ధిలో తెలంగాణ పాత్ర కీలకం : రాజ్ నాథ్ సింగ్
Advertisement
తాజా వార్తలు
Advertisement